Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

హోలీ ఆడాలి..

హోలీ ఆడాలి..

1 min
217


అప్పట్లో అనుకోలేదు. ఇంకొంచెం ప్లాన్ చేసుంటే సరిపోయేది. ప్లానింగా పాడా...నాక్కొంచెం బెరుకంతే.


నా చుట్టూ రంగులు. ఎక్కడ చూసినా రంగులే. నీలం, పసుపు, గులాబీ రంగు, ఆకుపచ్చ..


ఇటువైపు అతను అమెరికన్ అనుకుంటా. అటువైపు చైనా అమ్మాయి. మరో చోట ఆఫ్రికన్ అబ్బాయి. ఇంకొకరు యూరప్ నుంచి. అందరూ కలిసి హోలీ ఆడుతున్నారు.


నా చుట్టూ మనుషులు. వివిధ వర్ణాల, వివిధ దేశాల మనుషులు. నవ్వులు. రంగులు. ఎందుకో నేను హోలీ ఆడలేకపోయాను. ఏదో బెరుకు నన్నాపింది.


ఇంకోసారి అలాంటి అవకాశం వస్తుందా? వస్తే తప్పకుండా హోలీ ఆడాలి..


Rate this content
Log in

Similar telugu story from Abstract