గడియారం తాత
గడియారం తాత
మా తాతకు గంటలు కొట్టే పెద్ద గడియారం అంటే చాలా ఇష్టం. ప్రతి గంటకూ అది ఎంత టైం అయిందో అన్ని గంటలు కొట్టేది. అలా కొట్టినప్పుడు తాత అందరికీ టైమ్ చెప్పేవాడు.
ఆ తరువాత చేతికి పెట్టుకునే గడియారాలు వచ్చాక కూడా తాత ఆ గంటలు కొట్టే గడియారం శబ్దం వినే సమయం తెలుసుకునే వాడు.
ఎంతో అపురూపంగా చూసుకునే ఆ గడియారాన్ని ఎవ్వరు ముట్టుకున్నా ఒప్పుకునేవాడు కాదు.
ఆ తరువాత ఎలక్ట్రానిక్ వాచీలు కూడా వచ్చాయి. తాత ఎంతో ఇష్టపడే ఆ గడియారం ఓ రోజు గంటలు కొట్టడం మానేసింది.
ఇక పైన వినడానికి తాత కూడా ఉండడని కాబోలు.
