Kishore Semalla

Drama Romance Tragedy

4.5  

Kishore Semalla

Drama Romance Tragedy

ఎవరు ప్రేమించాలి?

ఎవరు ప్రేమించాలి?

6 mins
355


తన పేరు స్వర్ణ. ఆమె ఒక వేశ్య. వేశ్య అంటే మగాడి సుఖాన్ని తీర్చే యంత్రం కాదు, తనకి కూడా ఓ మనసు ఉంటుంది. ప్రేమ అనే భావన నీకు నాకు ఎలా కలుగుతుందో తనకి అలానే కలుగుతుంది. చెప్తే ఆశ పడింది, శరీర వ్యామోహాం అనుకుంటారనే భయం తో లోలోపల మాటలు రావు తనకి. అలాంటి వేశ్య ప్రేమని చెప్పే కథ ఇది.

          *********************************

సాయంత్రం ఆరు అయ్యింది. అందగత్తెలంతా అందాలు ఆరబోస్తున్నారు. వచ్చి పోయే మగాళ్లతో చాలా గిరాకీ నడుస్తోంది ఈరోజు. మల్లెపూల వాసన గుమాయిస్తోంది. సామ్రాని పొగ కమ్మేసింది.

కోడిపెట్టలు, హంసలు, నెమలులు అన్నీ జతకట్టి నాట్యమాడుతున్నాయి. ఏ పెట్ట రేటు ఎంతో కనుకుంటున్నారు కుర్రోళ్ళు. అప్పుడు వచ్చింది సొగసుల సుకుమారి 'స్వర్ణ'.

స్వర్ణాభరణలు వేసుకోలేదు కానీ దగదగలాడిపోతుంది. చిన్నా పెద్దా ఎవరొచ్చినా చూపంతా ఆమె పైనే. ఎకరం పొలం అమ్మైనా తనతో ఓ రాత్రి గడపాలని కొందరు. దాచుకున్న సేవింగ్స్ పోయినా ఫర్వాలేదు అన్నంత కరువులో వున్నారు మరికొందరు.

స్వర్ణ కోసం వేలంపాటే నడుస్తోంది అక్కడ.

ఆగండి అబ్బాయిలు!!!! స్వర్ణ కావాలి అంటే "పెట్టి పుడితే సరిపోదు, ఈ పెట్టె నిండాలి". అప్పుడే స్వర్ణ మీ సొంతం. ఎవరో ఆ అదృష్టవంతుడు అని డబ్బులు లెక్కపెడుతోంది 'బుల్లెట్' జ్యోతి. ( ఆమె వయసులో దూకుడు చూసి కుర్రాళ్ళు ముద్దుగా పెట్టుకున్న పేరు బుల్లెట్)

                     ******************

ఆఫీసు లో నాగ్ మరియు రామ్:

నాగ్ చాలా బాధ లో వున్నాడు. చాలా అప్సెట్ లో వున్నాడు. తను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి వదిలి వెళ్ళిపోయింది అని. రామ్ తనకి నచ్చజెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు కానీ అదేది నాగ్ కి ఎక్కట్లేదు. నన్ను ఒంటరి గా వదిలేయ్ రామ్, నేను ఈ బాధ భరించలేకపోతున్న. తను గుర్తొస్తుంటే ప్రతి క్షణం నరకం లా అనిపిస్తుంది, చావాలని వుంది. ప్లీజ్!!!! నన్ను వదిలేయ్ అని చెప్పి బల్ల పైన తల పెట్టుకుని ఏడుస్తున్నాడు.

పిచ్చోడా!!!! అమ్మాయి వదిలి వెళ్ళిపోతే ఇలా ఏడుస్తావ్ ఏంటి!!! పండగ చేసుకోవాలి. నాకు తెలిసిన మంచి చోటు ఒకటి వుంది, అక్కడికి వెళ్తే నీ బాదలన్నీ మర్చిపోతావ్. ఒక్కసారి వచ్చి చూడు అని చెప్పాడు.

నన్ను వదిలేయ్ అన్నా కదా!!! నేను ఎక్కడికి రాను అని నాగ్ చెప్పినా వినకుండా రామ్ తనని పైకి లేపాడు. ముందు పద నాతో, అంతా అదే సెట్ అవుతుంది. ఇష్టం లేకున్నా నాగ్ తనతో బయల్దేరాడు.

కార్ సరాసరి బులెట్ జ్యోతి బంగ్లా దగ్గర ఆగింది. ఏం చోటు ఇది చుట్టు పక్కల ఎవరు లేరు, ఇంట్లో లైట్లు కూడా వెలగట్లేదు అని అడిగాడు నాగ్ పరిసరాలు పర్యవేక్షిస్తు.

హాహాహా!!! నవ్వుతూ.......పద లోపలకి నీకే తెలుస్తుంది అన్నాడు రామ్.

ప్రస్తుతం:

చుట్టూ జనం, స్వర్ణ కోసం వేలంపాట జరుగుతుంది. లోపలికి అప్పుడే వచ్చాడు నాగ్. స్వర్ణ కుర్రకారు తో జోరుగావుంది, వాళ్ళని ఆటపట్టిస్తుంది. నవ్వులని వెదజల్లుతుంది.

కుర్రకారుని వెంటబెట్టుకుని పరిగెడుతుంది. అలా పరిగెడుతూ వెళ్లి సరాసరి నాగ్ ని గుద్దుకుంది. నాగ్ ఛాతీ తన తల ని గట్టిగా తాకింది. అబ్బా!!! ఎవరయ్యా నువ్వు ఇంత గట్టిగా ఉన్నావ్ అని నుదురు ని రుద్దుతూ తలని పైకి లేపింది.

ఏం అందం అది. క్లాక్ టవర్ లాంటి పొడుగు, పొడవాటి జుత్తు వెనక్కి దువ్వి హీరో లా వున్నాడు. రంగు ఐతే చెప్పపనక్కర్లేదు ఎర్రగా యాపిల్ పండు లా వున్నాడు. ఛాతీ దెబ్బ చూసింది గా, జిమ్ బాడీ అని తెలుస్తుంది. షర్ట్ లోపల సిక్స్ ప్యాక్ వుండే ఉంటుంది. ఏం ఉన్నావ్ రా బాబు???? అని అలా వెనక్కి పడింది. తన చేతిని పట్టుకున్నాడు నాగ్. అలా మెల్లగా పైకి లేపాడు. నాగ్ నే తదేకంగా చూస్తుంది స్వర్ణ.

ఇదంతా గమనించాడు రామ్. నవ్వుకుని..... ఏం బులెట్ (జ్యోతి) వ్యాపారం జోరుగా ఉందా???? చిక్కినట్టు ఉన్నావ్ నా మీద బెంగ పెట్టుకున్నవా??? ఏంటి? అని సరదాగా అడిగాడు.

అవును!!! నీ మీదే బెంగ. ఈ మధ్య రావట్లేదు, గర్ల్ ఫ్రెండ్ ఏమన్నా దొరికిందా ఏమిటి??? అని అడిగింది.

పెళ్లి అయింది తల్లి. ఇలాంటివి తెలిస్తే కాపురాలు కూలిపోతాయి. నాకోసం రాలేదు అదిగో అక్కడ పొడుగ్గా తాటిచెట్టు లా కనిపిస్తున్నాడే వాడి కోసం వచ్చాను. పాపం గర్ల్ ఫ్రెండ్ వదిలి వెళ్ళిపోయింది వాడిని. బాధ లో ఉన్నాడని ఇక్కడికి తీసుకొచ్చాను. స్వర్ణ ఐతేనే బాగా డీల్ చేస్తుంది వాడిని. ఎంతైనా పర్లేదు, ముందు మావోడేకే స్వర్ణ కావాలి ఇదిగో కార్డ్ కావాల్సినంత గీక్కో అందులో అని చెప్పి కార్డ్ ఇచ్చాడు.

భయపడుతున్నాడు నాగ్. అరేయ్!! నాకు వద్దురా ఇలాంటివి వెళ్లిపోదాం పద అని వెనకడుగు వేస్తున్నాడు. ఏం కాదు వెళ్ళు అని ధైర్యం చెప్పి లోపలికి తోసాడు. ఇదిగో స్వర్ణ చిన్న పిల్లోడు మావోడు కాస్త చూస్కో జాగ్రత్త గా అని చెప్పాడు రామ్.

సరే నువ్వెల్లు ఇక. బయటకి పెద్దోడిలా వస్తాడు లే మీవాడు అని చెప్పింది స్వర్ణ.

తలుపు దగ్గరే నిల్చున్నాడు నాగ్. ఏంటి?? మన సినిమా అందరూ చూడాలా??? తలుపు కి గడి పెట్టి రా ఇక్కడికి అని స్వర్ణ చెప్పింది.

గడి పెట్టి దగ్గరకి వెళ్ళాడు. మంచం పైన దూరంగా కూర్చున్నాడు నాగ్. ఐతే అంత్యాక్షరి మొదలుపెడదమా ఇంకా లేట్ ఎందుకు అని అడిగింది స్వర్ణ.

అంత్యాక్షరి ఏంటి??? ఇప్పుడు అది ఆడాలా మనం అని అమాయకంగా అడిగాడు నాగ్.

మరి లేకపోతే ఏంటయ్యా!!! నువ్వు అక్కడ నేనిక్కడ వుంటే పని ఎలా జరుగుతాది. కాస్త దగ్గరకు రా అని పిలిచింది.

మెల్లగా జరుగుతున్నాడు స్వర్ణ వైపు. ఇలా పని కాదు అని తనే నాగ్ తొడ పైన చెయ్యి వేసింది. వణకడం మొదలుపెట్టాడు. చేతులు కూడా వణుకుతున్నాయి, పట్టుకుంది రెండు చేతుల్ని.

కూల్ డౌన్!!! కూల్ డౌన్!!! నా కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడు. అలానే చూస్తూ వుండు, రెప్ప వెయ్యకు. నా కళ్ళని మాత్రమే చూడు. చేతులు వణకడం తగ్గుతుంది. పూర్తిగా కూల్ డౌన్ అయ్యాడు రెండు చేతుల్ని వదిలేసింది.

చీరని తీసి పక్కకి విసిరేసింది స్వర్ణ. ఎన్నెన్నో అందాలు ఎదురుగా కనిపిస్తున్నాయి నాగ్ కి. తాకాలని ఆశ పుట్టింది. కోరిక ఎక్కువయ్యింది. మెల్లగా చేతిని తీసుకువెళ్తున్నాడు. బులెట్ ట్రైన్ లా ఉండాలి అయ్యా. పాసెంజర్ ట్రైన్ లా వస్తే ఎప్పుడు చేరుకుంటావ్ అని స్వర్ణ నాగ్ చేతిని తన ఎద కు అనించింది. మాటలు తడబడుతున్నాయి నాగ్ కి. నవ్వుకుంది స్వర్ణ. దగ్గర కి లాక్కుని హత్తుకుంది గట్టిగా.

సునామీ తప్పదు ఇక అనుకున్నాడు నాగ్. పాన్పు పైన పడ్డారు ఇద్దరు. చొక్క తీసి విసిరేశాడు. వెలుగుని చీకటి మింగేసింది. మంచం బ్రేక్ డాన్స్ లు వెయ్యడం మొదలుపెట్టింది. ఎవరు చూడొద్దని దుప్పటి ఇద్దర్ని చుట్టేసింది. అరగంట తరువాత అలసిపోయిన శరీరాలు దాహం అంటున్నాయి. పక్కనే వున్న పాల గ్లాసు ని అందుకున్నాడు నాగ్. స్వర్ణ చేతికి అడిగింది. నోరు తెరవమన్నాడు. నోట్లో ఒక్కో చుక్క పోస్తున్నాడు, పాలన్నీ పెదాలని తడిపేశాయి. ఆ పాల పెదాలను తన పెదాలతో రుచి చూసాడు నాగ్.

ఇంత ఆనందం ఇప్పటివరకు నేను చూడలేదు స్వర్ణ. "థాంక్స్ ఏ లాట్" నువ్వు ఇచ్చిన ఈ అరగంట సంతోషం నేను ఎప్పటికి మర్చిపోలేను అని చెప్పాడు నాగ్ ఆనందం తో.

మనసులో స్వర్ణ కి ఇదే ఆనందం కానీ బయటకి చెప్పలేదు. అందరితో ఇదే మాట చెప్తుంది అనుకుంటాడు ఏమో అని. నవ్వేసింది. తన ప్రేమ ని నాగ్ నుదురు పైన ముద్దు పెట్టి చూపించింది. ఇప్పటి వరకు తను పడుకుంది డబ్బు కోసం మాత్రమే కానీ మొదటిసారి ఇష్టం తో పడుకుంది. నాగ్ తన మనసుకు దగ్గరయ్యాడు.

బట్టలు వేసుకున్నాడు. చీకటి అలసిపోయి వెలుగుని గెలిపించింది. దుప్పటి డ్యూటీ అయిపోయింది. మంచానికి కాళ్ళు నొప్పులు వచ్చాయేమో డాన్సులు ఆపేసింది.

నాగ్ బయటకి నవ్వుతూ చాలా హుషారు గా వచ్చాడు. బాధ లేదు ఇప్పుడు, ఆనందం మాత్రమే వుంది. నాగ్ ని చూసి రామ్, ఈ మాత్రం దానికి చావు వరకు వెళ్లావు. స్వర్గం ఇక్కడ వుంటే ఎక్కడికో వెళ్లి చూస్తానంటావెంట్రా అని స్ఫూర్తి కలిగేలా మాట్లాడాడు.

నాగ్ కి ఆరోజు నుంచి ఎప్పుడు స్వర్ణ గుర్తు వచ్చిన వచ్చే వాడు. ఆ ఒక్క గంట ఆనందంగా గడిపేవాడు. నాగ్ ఎప్పుడు వస్తాడని ఎదురుచూపులు కూడా వుండేవి స్వర్ణ కి. రాను రాను స్వర్ణ కి నాగ్ పైన ప్రేమ పెరిగిపోతుంది, దాచుకోలేనంత. ఈసారి నాగ్ వస్తే అడుగుదాం అని నిర్ణహించుకుంది.

యధావిధిగా ఎదురుచూస్తుంది నాగ్ కోసం. శనివారం అది, నాగ్ కి వీకెండ్ ఈరోజు. ఎలా చెప్పాలి??? చెప్తే ఒప్పుకుంటాడా??? తనకి నేనంటే కూడా చాలా ఇష్టం. చాలా సార్లు తన కళ్ళలో చూసాను. చాలా సిగ్గేస్తుంది మొదటిసారి. ఏంటి ఈ పులకరింత, నాలో నాకే ఇంత కొత్తగా వుంది. ప్రేమ అంటే అంతేనేమో సిగ్గోచేస్తుంది అమ్మాయికి.

ఇంతలో రానే వచ్చాడు నాగ్ చాలా ఆనందం తో. తలుపు గడి పెట్టి పరిగెత్తుకుని వచ్చి స్వర్ణ ని పైకి లేపి గిరా గిరా తిప్పేసాడు. ఏంటి? ఇంత ఆనందం. ప్రమోషన్ ఏమన్నా వచ్చిందా?? అస్సలు ఆగట్లేదు సర్ ఈరోజు అని అడిగింది స్వర్ణ. ముందు నువ్వు కూర్చో నీతో పంచుకోవాలి అనే వచ్చాను ఈ మాట ని. నువ్వు రావడం నా జీవితం లో ఓ అదృష్టం స్వర్ణ అని చెప్పాడు.

నేను చెప్తా అనుకున్నా. తానే చెప్పేస్తాడా ఏంటి??? అనుకుంది స్వర్ణ.

నువ్వు నా జీవితం లో చాలా మార్పులు తెచ్చావు. నీ వల్ల నేను మళ్ళీ మాములు మనిషిని అయ్యాను. అన్నిట్లో కలిసి వచ్చింది. తను మళ్ళీ నాకోసం వచ్చేసింది. మా రెండు ఇళ్లలో కూడా మా ప్రేమ ని ఒప్పేసుకున్నారు. ఈ విషయం నీకే మొదట చెప్పాలని అనుకున్నాను. నాకు తెలుసు నువ్వు చాలా సంతోషిస్తావ్ ఈ విషయం విన్న వెంటనే అని. అది నీ కళ్ళలో చూడాలని వచ్చాను అని చెప్పాడు నాగ్.

మనసు ముక్కలయ్యింది స్వర్ణ కి. ఆశలు అన్ని చచ్చిపోయాయి. వేశ్య కి ప్రేమించే అర్హత కానీ హక్కు గాని లేదు. ప్రేమ మన లాంటి వాళ్ళకి ఎందుకు అనుకుంది. అందరితో అనుబంధం ఆ కాసేపు మాత్రమే అనుకోవాలి అంతే తప్ప వాళ్ళతో జీవితం కోరుకోకూడదు. తలరాత ఇంతే, నేను వేశ్య గా జీవితం కోరుకోలేదు, కానీ అనాధ గా పుట్టాను. తల్లి తండ్రి లేని దానిని. అన్నం పెడతా అని తీసుకుని పోయారు కొందరు. చిన్న వయసులోనే నాకు ఇంజెక్షన్ లు వేసి కోరికలు పుట్టేలా చేశారు. ఆశ లేదు పెళ్లి అనే ఊహ కూడా లేదు. నాగ్ బాధ లో వున్నప్పుడు నా దగ్గరకి వచ్చాడు. ఇప్పుడు నేను ఎవరి దగ్గరకి వెళ్ళాలి అనుకుంది స్వర్ణ మనసులో.

ఏం మాట్లాడవేంటి స్వర్ణ అని నాగ్ అడిగాడు. కళ్ళని తుడిచి కష్టంగా వున్నా నవ్వి.... " పెళ్ళాం దొరికింది కదా! ఇక మమ్మల్ని ఎందుకు గుర్తు పెట్టుకుంటారు" అని అసూయ గా చెప్పింది.

నేను నిన్ను మర్చిపోవడమా!!!! జరగని పని. ఇక మనం ఇలా మాములు గానే కలవాలి. శారీరకంగా కుదరదు స్వర్ణ. ఇంకా చాలా మందిని కలవాలి. నీకే మొదటి గా చెప్పాలని వచ్చాను అని చెప్పి బయల్దేరాడు. చెయ్ ఊపుతూ సాగనంపుతూ నిల్చుంది స్వర్ణ. మళ్ళీ వెనక్కి వచ్చాడు నాగ్. స్వర్ణ ని గట్టిగా హత్తుకున్నాడు. చాలా థాంక్స్ స్వర్ణ అని చెప్పి వెళ్ళిపోయాడు.

తలుపు గడి పెట్టుకుని మంచం పైన పడింది స్వర్ణ. తన్నుకొస్తున్న దుఃఖం ఎంత సేపు ఏడ్చినా తగ్గదు. బాధలో కృంగిపోయింది.

ఈ కథ అందరిదీ.... ప్రేమ అంటే అందంగా ఉన్నవాళ్లే కాదు, డబ్బు ఉన్న వాళ్లే కాదు అందరిలో పుడుతుంది. చాలా మంది ప్రేమికులు వన్ సైడ్ లవర్స్ గానే మిగిలిపోతున్నారు. స్వర్ణ విషయం లో కూడా అదే జరిగింది. తను వేశ్య కాబట్టి ప్రేమ ఎందుకు పుడుతుంది అనుకున్నాడు నాగ్. తనని పడక సుఖం కోసమే ఆలోచించాడు తప్ప స్వర్ణ ప్రేమని గుర్తించలేకపోయాడు.

"ప్రేమ మనసుకి సంబంధించినది, శరీరానికి కాదు".

కానీ ప్రేమ అర్ధమే మారిపోయిన రోజులివి. నిజమైన ప్రేమని గుర్తించండి, జీవితాంతం తోడు ఉంటుంది మీతో.

                                       



Rate this content
Log in

Similar telugu story from Drama