Dinakar Reddy

Abstract Children Stories

3  

Dinakar Reddy

Abstract Children Stories

ఎన్టీవోడు అంటే ఎన్టీవోడు

ఎన్టీవోడు అంటే ఎన్టీవోడు

1 min
216


అమ్మమ్మా! ఎందుకని ఇవాళ టీవీ రిమోట్ పట్టుకుని కూర్చున్నావ్. స్కూల్ నుంచి అప్పుడే వచ్చిన రాజీవ్ అమ్మమ్మను అడిగాడు.


అమ్మమ్మ నవ్వుతూ ఈ రోజు ఎన్టీవోడి సినేమా వేస్తున్నారు బాబూ.


అమ్మమ్మా ఎన్టీవోడు అంటే ఎవరు? అని అడిగాడు రాజీవ్.


ఎన్టీవోడు అంటే ఎన్టీవోడు. ఇప్పుడు చూపిస్తాను అని లవకుశ సినిమా చూపించింది. ఈయన NTR కదా అమ్మమ్మా అని తనకూ తెలుసన్నట్లుగా చెప్పాడు రాజీవ్.


ఆయనేరా నందమూరి తారక రాముడు. తెర మీద రాముడు. కృష్ణుడు. భీష్ముడు. కర్ణుడు. అడవి రాముడు. విశ్వామిత్రుడు. చంద్రగుప్తుడు ఇలా అన్ని పాత్రలలో కనిపించి తెలుగు వాళ్లను మెప్పించిన

ఎన్టీవోడు.


మేము కాలేజీలో ఉన్నప్పుడు ఎన్టీవోడి సినిమా వచ్చిందంటే పండగే అనుకో.


అరేయ్ ఎల్లుండి మన ఎన్టీవోడు సినిమా రిలీజు. ఆ మరుసటి రోజు మనందరం ఎన్టీవోడి గెటప్పులో కాలేజీకి వెళ్దాం అని అబ్బాయిలు ఒక వైపు హీరోయిన్ వేసుకున్న లాంటి బట్టలు వేసుకోవాలని అమ్మాయిలు పోటీ పడే వాళ్ళం.


ఎన్టీవోడు నాగ్గాడు ఫ్యాన్స్ అప్పుడప్పుడు గొడవ పడేవారు. మళ్లీ తెర మీద ఇద్దరినీ చూసి కలిసి పోయేవాళ్లు.


ఏమైనా ఆ రోజులే వేరు. ఎన్టీవోడు నాగ్గాడూ ఎంత బాగా చేసే వాళ్ళో అని అమ్మమ్మ పాత జ్ఞాపకాలన్నీ రాజీవ్ తో చెబుతూ సంబరపడింది.


Rate this content
Log in

Similar telugu story from Abstract