Dinakar Reddy

Abstract Drama Inspirational

4  

Dinakar Reddy

Abstract Drama Inspirational

చేతిలో తెలుగు నవల

చేతిలో తెలుగు నవల

1 min
1.5K


ఏదేమైనా సరే. ఈవేళ అనుకున్నది చేయాల్సిందే. ఎన్నాళ్ళ నుంచి అనుకుంటున్నాను ఈ పని చేయాలని. 


ఇంకా గంట పైనే పడుతుంది ట్రైన్ కదలడానికి. నేను నా బెర్త్ ఉన్న బోగీ ఎదురుగా ఉన్న బెంచీ మీద కూర్చున్నాను.


లగేజీ పక్కన పెట్టుకుని బ్యాగ్ లోపల నుంచి పుస్తకం బయటికి తీశాను. 


ఎదురుగా ఎక్కాల్సిన ట్రైన్. చుట్టూ ప్రయాణీకులు. నా చేతిలో పాత తెలుగు నవల. సినిమాల్లో ఎప్పుడు చూసినా రైల్వేస్టేషన్ అంటే చాలు. ప్రధాన పాత్ర ఓ ఇంగ్లీష్ పుస్తకం పట్టుకుని అందులో మునిగిపోతూ ఉంటుంది.


అవి చూసినప్పటి నుంచీ నాకు ఒకటే ఆలోచన. నేను తెలుగు పుస్తకం పట్టుకుని కూర్చోవాలి. ఆ తెలుగు పుస్తకం చూసి ఎవరో ఒక సాహిత్య అభిమాని తెలుగు పుస్తకాల గురించి మాట్లాడతారేమో అని.


ప్చ్. లాభం లేదు. ఇక ట్రైన్ కదలడానికి అట్టే సమయం లేదు. నేను ట్రైన్ ఎక్కి నా బెర్త్ మీద కూర్చుని అలా బయటికి చూస్తున్నాను.


ట్రైన్ కదిలింది. దూరంగా ఎవరో ఒకమ్మాయి బెంచీ పుస్తకం చదువుతూ కూర్చున్నాడు. పుస్తకం పేరు కనిపించలేదు. దాని మీద బాపూ గారి బొమ్మ కింద ఏవో తెలుగు అక్షరాలు కనిపించాయి.


నేను తృప్తిగా కళ్ళు మూసుకుని పడుకున్నాను.


Rate this content
Log in

Similar telugu story from Abstract