బతకటమే నీతి?
బతకటమే నీతి?


నీతి, ధర్మ శాస్త్రం అన్ని – బతికే వీలున్న వాళ్ళకి …. బతకటమే కష్టమైన వాళ్ళకి బతకటమే నీతి .. బతకటమే ధర్మం, బతకటమే శాస్త్రం …
అతనికివే మాటలు గుర్తుకు వస్తున్నాయి.రైలు ప్రయాణంలో "అసమర్థుని జీవ యాత్ర " పుస్తకం చదివాడు. అందులోని ఈ వాక్యాలు అతణ్ణి వదలడం లేదు.
ఆలోచించి చూస్తే తనకి కూడా బతకడం కష్టంగానే ఉంది.గవర్నమెంటు ఆఫీసులో గుమాస్తా.
వచ్చేదేమో చాలీ చాలని జీతం.
భార్య ఇంట్లోకి వాషింగ్ మెషీన్, ఏసీ ఇంకా ఏవేవో సౌకర్యాలు కావాలంటోంది.
ఆ మాత్రం లేకపోతే వాళ్ళు ఉండే దానిని ఇల్లు అనరని అందరి అభిప్రాయం.అవన్నీ పెట్టాలంటే ఇల్లు మారాలి.
rong> ఇవన్నీ చూస్తే నాకూ బతకడం కష్టంగానే ఉంది అని అతను పదే పదే అనుకున్నాడు. అతను జ్ఞానాన్ని వెతుకుతున్నాడు.రైల్లో చాలా మంది కాషాయం కట్టుకున్న సన్యాసులు ఉన్నారు. పిల్లలతో ప్రయాణిస్తున్న సంసారులూ ఉన్నారు. అతడికి జీవితంలో ఎవరిలా ఉండాలో అర్థం కావట్లేదు. కళ్ళు మూసినా తెరిచినా వాషింగ్ మెషీన్ గుర్తుకు వస్తోంది. రైలు అతను దిగాల్సిన స్టేషన్లో ఆగింది.అతడు ఆలోచనలన్నీ పక్కన పెట్టి లగేజీ పెట్టెలు పట్టుకుని రైలు దిగాడు. ఎవరో పరిచయం ఉన్న వ్యక్తి అతడిని సీతారామారావు అని పిలిచాడు.