బొమ్మరిల్లు సినిమాలో..
బొమ్మరిల్లు సినిమాలో..
ఇప్పుడు నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. అంతే కదా నాన్నా. సరే చేసుకుంటాను. చేసుకున్న తరువాత ఈ ఇంట్లో ఉండను అన్నాడు సిద్దూ.
అంటే. వేరుగా ఉంటావా? అన్నాడు వాళ్ళ నాన్న.
అవును నాన్నా. మీరు నన్ను గొప్పగా చూడాలనుకుంటారు. నేను కాదనట్లేదు. కానీ నిజంగా ఒక్కసారి ఆలోచించండి. నేను లోన్ తీసుకుని బిజినెస్ చేసి విజయం సాధిస్తే దానిలో మీరు తృప్తిని వెతుక్కోలేరు. మీకు కావల్సింది నేను విజయం సాధించడం కాదు.
సిద్దార్థ్ ఆవేశం చూసి వాళ్ళ అమ్మ ఆపమని చెప్పడానికి ప్రయత్నిస్తుంది.
సిద్దూ వాళ్ళ నాన్న మాత్రం నేను తెలుసుకోవాలి చెప్పు అంటాడు.
అవును నాన్నా. మీకు కావాల్సింది నా విజయం కాదు. మీ అదుపాజ్ఞల్లో ఉంటూ మీరు చెప్పింది చేస్తూ నేను విజయం పొందడం. మీరు మమ్మల్ని కంట్రోల్ చేయడంలో సంతోషిస్తారు.
అది మా మంచికే అని మీరనుకుంటారు. కరెక్టే. మొక్కకు నీళ్లు పోసి దాన్ని నీడలో పెట్టుకుంటాను అంటే ఎలా(అంటే కొన్ని మొక్కలకి సూర్యకాంతి తప్పనిసరిగా కావాలి). గాలినీ, వాననీ తట్టుకుని నిలబడితే చెట్టుగా అవుతుంది.
మీరు మారతారని నాకు నమ్మకం లేదు. అందుకే దూరంగా వెళ్ళిపోయి నా బతుకు నేను బతుకుతాను అన్నాడు సిద్దూ.
అతనలా మాట్లాడి బయటికి వెళ్ళిపోయాడు.
