అవ్వా, తాతల
అవ్వా, తాతల
అవ్వా, తాతలంటే మనవడికి భలే బ్రెమ అంది అమ్మ. నేను దాచి పెట్టుకున్న నువ్వులుండలు తాతయ్య రాగానే ఆయన చేతిలో పెట్టాను. అప్పుడు అమ్మేమో ఇలా అంది.
తాతయ్య చేతిలో ఉన్న బ్యాగు తీసుకుని అమ్మ భోజనానికి సిద్ధం చేస్తోంది. పండక్కి ఉంటావా నాన్నా.. అమ్మను కూడా తీసుకుని రావాల్సింది అంది.
లేదమ్మా. వీణ్ణి పండక్కి తీసుకెళ్దాం అని వచ్చాను అన్నాడు తాత. అది వినీ వినగానే నేనో చిన్న సంచీలో రెండు చొక్కాలు పెట్టుకుని బయటికి వచ్చాను.
అప్పుడే చూడు. వీడు తయారయిపోయాడు అంది అమ్మ.
అక్కడికెళ్తే అల్లరి చేయొచ్చు అనే కదా అని నా వైపు చూసింది.
మా బంగారు కొండ. అల్లరి అస్సలు చేయడు అని తాత నన్ను ఎత్తుకున్నాడు. సరే నాన్నా. నువ్వు వీణ్ణి తీసుకెళ్లు. నేనూ, ఆయన ఇక్కడ పనులన్నీ చూసుకుని పండుగ సాయంత్రానికి ఊరు వచ్చేస్తాము అంది అమ్మ.
నేనూ, తాతా కలిసి వినాయకుణ్ణి చేద్దాం అని మాట్లాడుకున్నాం. అవ్వ ఓలిగలు చేస్తుంది అని చెప్పాడు తాత.
