అపరిచిత వ్యక్తి
అపరిచిత వ్యక్తి
ఇందాక ఎవరండీ మీ ఇంటికి వచ్చింది అని అడిగాను పక్కింటి రాజేష్ గారిని.
అతనా! స్ట్రేంజర్ ఫర్ యు యాప్ నుంచి వచ్చాడు. నేనే కొంచెం ఇంట్లో పనులుండి పిలిచాను. మేము ఊరి నుంచి రాగానే వెళ్ళిపోయాడు అన్నారు రాజేష్ గారు.
అదేంటి? మీరు లేనప్పుడు మీ ఇంట్లో తెలీని వ్యక్తి ఎలా ఉంటారు? అని అడిగాను.
అదేం లేదు సుబ్రమణ్యం.. మనం ఓ రెండ్రోజులు ఊరు వెళ్తున్నాం అనుకోండి. ఇంట్లో ఉండే పెట్స్ ని చూసుకోవడానికి, గార్డెనింగ్ చేయడానికి అన్నమాట. వాళ్ళు మనం లేనప్పుడు ఇంట్లోనే ఉండి ఇంటిని జాగ్రత్తగా చూసుకుంటారు. మనం కొంత ఫీజు ఇవ్వాలి. అలానే మన వస్తువులు వాళ్ళు వాడుకుంటే ఒక ఫీజు, లేదంటే మరో ఫీజు. ఇలా అన్న మాట. మనకు వాళ్ళు ఇంట్లో ఉండడం ఇష్టం లేకపోతే పనులు చేసిన తరువాత వాళ్ళు తెచ్చుకున్న వ్యాన్ లో పడుకుంటారు. అంతే. చాలా ఈజీగా ఉంటుంది ఈ పద్ధతి అని చెప్పి ఆ అపరిచిత వ్యక్తి కార్ బాగా తుడిచాడో లేదో అని చెక్ చేసుకుంటున్నారు రాజేష్ గారు.
ఏమిటో. కొత్త వాళ్ళే ఇంట్లో వాళ్ళు. ఇంట్లో వాళ్ళే కొత్త వాళ్ళు అనుకుని నేనూ ఆ యాప్ కోసం ఫోన్లో వెతికాను.
