అంతా ఆనందమే
అంతా ఆనందమే
ఈ దేశంలో సన్యాసులు సంసారం గురించీ, సంసారులు సన్యాసం గురించీ మాట్లాడతారు.
వైష్ణవ్ ఉపన్యాసంలో మాట్లాడాల్సిన విషయాలు మననం చేసుకుంటున్నాడు. ఇంతలో ఒక సంస్థ వారు ఫోన్ చేశారు.
మీరు ఆనందం గురించి ఉపన్యాసం ఇవ్వాలండీ. ఈ మధ్య ఆఫీసు వాళ్ళు ప్రతి విషయానికీ డీలా పడుతున్నారు. మీరు వారికి కాస్త ఉద్యోగ ధర్మాలూ అవీ చెప్పి కాస్త హుషారు చేయాలి అని వారి విన్నపం.
వయసు ముప్పై ఏళ్లు దాటింది ఈ మధ్యే. అటు మోటివేషనల్ స్పీకర్ గానూ, ఆధ్యాత్మిక విషయాలు వివరించే జ్ఞానిగా పేరు తెచ్చుకున్నాడు వైష్ణవ్.
అలానే చెబుతాను అని అపాయింట్మెంట్ ఇచ్చేశాడు.
అయినా ఆఫీసులో వాళ్ళకి సమయానికి ఇంక్రిమెంట్, బోనస్ ఇస్తే వాళ్ళే చలాకీగా పని చేస్తారు. సంతోషంగా ఉండడానికి కావాల్సిన డబ్బు ఉంటే కదా దానిని
ఉపయోగిస్తారు(?)
అది వదిలిపెట్టి ఇలా నాతో మోటివేషనల్ మాటలు చెప్పించడం ఏమిటో. అయినా సరే. మన పని మనం చేద్దాం అని మనసులో అనుకున్నాడు.
అంతా ఆనందమే అంటూ ఇవ్వాల్సిన స్పీచ్ కి సంబంధించిన విషయాలు వ్రాసుకున్నాడు వైష్ణవ్.
