STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama Inspirational

4  

Dinakar Reddy

Abstract Drama Inspirational

అన్నదానం

అన్నదానం

1 min
519

ఏ పండగ వచ్చినా అనసూయమ్మ వాళ్ళింట్లో అన్నదానం ఉండాల్సిందే. అది అటు అమ్మగారింటి నుంచీ, ఇటు అత్తగారింటి నుంచీ ఆవిడ అందిపుచ్చుకున్న ఆచారం.


ఎవరైనా ఎందుకండీ ఈ అన్నదానాలు అంటే ఆవిడ నవ్వేస్తుంది. ఆ సర్వేశ్వరుడు అన్ని ప్రాణుల యందూ ఆకలి రూపంలో ఉన్నాడనే కదా పెద్దలు చెప్పింది. ఆ ఆకలి తీరిస్తే అదే భగవంతుని సేవ అని చెప్పేది.


ఆవిడ దగ్గర డాబూ, దర్పం లేదు. తను గొప్ప పని చేస్తున్నట్లు ఎన్నడూ అనుకోలేదు.


ఈ జన్మ పరోపకారం కోసమే అని నమ్మి ఆ కుటుంబ సంప్రదాయాన్ని, భారతీయ సంస్కృతిని గౌరవిస్తూ జీవించింది.


ఆవిడ తనువు చాలించిన రోజున ఎంతో మంది కన్నీటి పర్యంతమయ్యారు. అన్నం పెట్టే అన్నపూర్ణ కనుమరుగయ్యిందని కలత చెందారు.


Rate this content
Log in

Similar telugu story from Abstract