ఆమె దక్కితే..
ఆమె దక్కితే..
ఇంకో రోజు ఎదురు చూసాడతను. ఆమె అదే దారిలో వెళుతోంది. చిన్న పిల్లలను దాక్కోమని అరుస్తూ, పెద్ద వాళ్ళను తిడుతూ రాత్రి పూట తిరుగుతోంది.
కొంత మంది ఆమెకు పిచ్చి పట్టింది అంటారు. కొంత మంది ఆ అమ్మాయిని ఇంట్లోంచి గెంటేశారు అని అంటారు.
నేనీ రోజు ధైర్యం చేసి ఆమె ముఖం చూసాను. కోల ముఖం. కళ్ళు అదురుతున్నాయి. ఆమె చేసే సైగలు కొంత భయపెట్టినా ఆమె అందం అందరినీ ఆకర్షిస్తుంది.
ఎవరీమె. ఆమె దక్కితే అదృష్టమే అని వీధిలో కుర్రాళ్ళు, ఈ వీధిలోంచి ఆమె వెళ్లిపోతే చాలనుకునే ఆడవాళ్ళ మధ్య ఆమె రోజూ అలాగే తిరుగుతోంది. తిడుతూ. ఏదో వెతుక్కుంటూ, తచ్చాడుతూ..
