Find your balance with The Structure of Peace & grab 30% off on first 50 orders!!
Find your balance with The Structure of Peace & grab 30% off on first 50 orders!!

gowthami chavala

Horror

4.5  

gowthami chavala

Horror

ఆ రాత్రి

ఆ రాత్రి

6 mins
853


ఇంక ఒక్క గంట మాత్రమే మీకు సమయం ఉంది ఆ తరువాత అమావాస్య ఘడియలు ఆరంభమవుతాయి ఆ తరువాత ఇంకెవ్వరూ మిమ్మల్ని కాపాడలేరు , నేనైనా ఇంకెవరైనా సరే. ఈ ఒక్క గంట నా శక్తులన్నీ ఉపయోగించి ఎలాగో దీనిని ఆపుతాను , ఆలోగా మీరు ఈ టెంకాయని ఊరి పొలిమేరలో ఉన్న అమ్మ వారి గుడిలో కొట్టి ఈ వీభూది ని ఆ పొలిమేరలోని చెరువులో కలిపి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లిపోండి. ఒక్కసారి పొలిమేర దాటితే ఇది మిమ్మల్ని ఇంకేమి చేయలేదు , మీరు మరలా ఈ ఊరు లోకి అడుగు పెడితే ఇంక అంతే. ఇంకొక్క ముఖ్య విషయం ఆలోపు తనకున్న శక్తిని ఉపయోగించి పరోక్షంగా మీరు పొలిమేర దాటకుండా చేసే అవకాశం ఉంది ఇది దృష్టిలో ఉంచుకొని ప్రయాణంలో వచ్చే అడ్డంకులు దాటుకుంటూ వెళ్ళండి. ఎంతో అప్రమత్తంగా ఉండాలి అని ఆ స్వామిజీ చెప్పడంతో వెంటనే నిద్రపోతున్న పాప ని తీసుకొని వెనక సీట్లో తన ఒడిలో పడుకోబెట్టుకొని సమన్విత వెనక కూర్చుంది . హిమాన్ష్ ముందు సీట్లో కూర్చుని కార్ స్టార్ట్ చేశాడు గుండెల్లో వేగం కార్ వేగం అంతకంతకూ పెరుగుతున్నాయి అమావాస్య ఘడియలు ప్రారంభమయ్యే సమయం కావడంతో దారంతా కటిక చీకటిగా ఉంది కార్ లైట్ ల వెలుతురు తప్ప ఇంకేమి కనపడటంలేదు అప్పుడే హోరుగా గాలి వీయడం మొదలైంది , ఆ గాలికి చెట్లన్నీ ఉగుతూ భయంకరమైన శభ్ధం మొదలైంది, గాలికి మట్టంతా సుడుగుండాలుగా మారి దారి కనపడటం లేదు కార్ అద్దాలు పైకి లేపింది , రెండు చేతులూ జోడించి ఆంజనేయ దండకం చదువుకుంటుంది సమన్విత. ఆ సుడిగుండాల వల్ల దారి కనపడక కార్ వేగం తగ్గించాడు హిమాన్ష్ ఇంతలో జోరున వర్షం కురవడం స్టార్ట్ అయింది భయంకరంగా ఉరుములు మెరుపులు మొదలయ్యాయి , ఒక పక్క నక్కల అరుపులు గుండెల్లో దడని పెంచుతున్నాయి , సమన్విత కి భయం ఎక్కువైంది గుండె వేగం పెరిగింది , ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి , కాళ్ళు చేతులు వణుకుతున్నాయి త్వరగా "పోనివ్వు హిమాన్ష్ మనకు ఎక్కువ సమయం లేదు అని అరుస్తుంది" సమన్విత. ఇంతలో ఉన్నట్లుండి కార్ టైర్ పంచర్ అయింది. వెంటనే కిందకి దిగి స్టెప్నీ తీసి మార్చడం మొదలుపెట్టాడు హిమాన్ష్ , కానీ ఆ చీకటి కి ఏమి కనపడటంలేదు ఈలోపు సెల్ల్ఫోన్ లోని లైట్ వెలిగించి హిమాన్ష్ చేతికి ఇచ్చింది సమన్విత , "త్వరగా కానివ్వు హిమాన్ష్ నాకు చాలా భయంగా ఉంది , కనుచూపుమేర ఒక్క వాహనం కూడా లేదు చుట్టూ దట్టమైన చెట్లు ఈ సమయంలో కార్ ఆగిపోయిందేంటి ఇదంతా ఆ దెయ్యం పనే అయి ఉంటుందా? ఇప్పుడు మనకు ఏమైనా అయితే...." ! అంటున్న భార్య చెయ్యి పట్టుకొని నువ్వేమి భయపడకు నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డువేసి అయినా నిన్ను కాపాడుకుంటాను అని హిమాన్ష్ చెప్తుండగా ఎదురుగా ఎంతో లావుగా , దృడంగా ఉండి చూస్తేనే భయమెసే విధంగా ఉండే ఒక దున్నపోతు వేగంగా పరిగెత్తుకుంటూ తన మీదకు రావడం గమనించి వెంటనే పక్కకు జరిగాడు హిమాన్ష్. అది వెళ్లి పెద్ద బండకు గుద్దుకుని ఆ బండ చిన్న చిన్న ముక్కలుగా విరిగిపోయింది మరలా పెద్దగా అరుస్తూ వెనక్కి తిరిగి రావడం గమనించి "త్వరగా... త్వరగా లోపలికి రా హిమాన్ష్ అది వచ్చేస్తుంది" అని అరిచింది" సమన్విత. ఒక్క నిముషం , ఒక్క నిముషం ఐపోవస్తుంది అంటూ టైర్ మార్చే పని వేగవంతం చేసాడు హిమాన్ష్ , ఆ దున్నపోతు సమీపిస్తోంది 10 అడుగుల దూరం 8 అడుగులు 4 అడుగుల దూరం ఒక్కసారిగా మీదకు దూకబోయింది వెంటనే కార్ ఎక్కి స్టార్ట్ చేశాడు. "హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది" సమన్విత. ఉన్నట్లుండి మరలా భయంకరమైన గాలి మొదలైంది ఇంతలోనే ఒక పెద్ద చెట్టు విరిగి పడింది కార్ కి అడ్డంగా "హిమాన్ష్.... అని అరిచింది సమన్విత" వెంటనే బ్రేక్ వేసాడు హిమాన్ష్. కిందకు దిగి ఆ చెట్టుని లేపడానికి ప్రయత్నిస్తున్నాడు ఎంతకీ కదలడంలేదు ఇంక ఎక్కువ సమయం లేదు ఏం చేయాలో అర్ధంకాలేదు సరే అని కార్ ని వెనక్కి తిప్పి వేరే దారికి మళ్లించాడు ఇంక 30 నిముషాల గడువు మాత్రమే ఉంది మళ్ళీ కార్ వేగం పెంచాడు దారిపొడవునా మలుపులు అతి కష్టం మీద ఆ మలుపులన్నీ దాటుకుంటూ కార్ ముందుకు వెళ్తుంది. మెల్లిగా కార్ గ్లాస్ మీద ఎవరివో చేతి గుర్తులు పడటం మొదలయ్యాయి చిన్నగా ఒక దాని తర్వాత మరొకటిగా కార్ గ్లాస్ మొత్తం చేతిగుర్తులతో నిండి పోయింది ఎంత తుడిచినా పోవడంలేదు కిందకి దిగాలంటే భయం , అయినా ఏమీ చేయలేక అలానే ముందుకు పోనిస్తున్నాడు హిమాన్ష్. వర్షం పెద్దదైంది వడగండ్ల వానగా మారి ఆ వడగండ్లు కార్ మీద పడి పెద్ద పెద్ద గా శబ్దం వస్తుంది , ఇంతలో ఎక్కడినుండో ఆడపిల్ల ఏడుపు వినపడింది చాలా భయంకరంగా ఉంది ఆ ఏడుపు సమన్విత కి ప్రాణం పోయేలాగా ఉంది ఆ అరుపు వింటుంటే , కాపాడండి... కాపాడండి అని అరుస్తున్నారు ఎవరో , చిన్నగా ఆ స్వరం దగ్గరకి వస్తున్నట్లుగా అనిపించింది హిమాన్ష్ కి , దగ్గరకి వచ్చే కొద్ది ఆ ఏడుపు తీవ్రత చాలా భయంకరంగా ఉంది గుండె జారిపోతుంది హిమాన్ష్ కి , వెంటనే కార్ వేగం పెంచాడు అది ఇంకా బిగ్గరగా వినపడటం మొదలైంది. ఇదంతా అది కావాలనే చేస్తుందని గ్రహించి ఆగకుండా ముందుకు వెళ్తున్నాడు హిమాన్ష్. సమాన్విత మాత్రం బిక్కు బిక్కు మంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కూర్చొని ఉంది తన కళ్ళు రెండు మూసుకొని పాప చెవులకి తన చేతులని అడ్డు పెట్టి. ఇంకా 10 నిముషాలు సమయం మాత్రమే ఉంది అమావాస్య ఘడియలు మొదలు అవ్వబోతున్నాయి ఇంతలో కళ్ళు తెరచి కార్ అద్దం లో నుండి బయటకి చూసింది సమన్విత. ఒక పొడవాటి చెయ్యి రక్తంతో తడిచి ఉంది , పొడవాటి వొంకర తిరిగిన గోర్ల తో కార్ గ్లాస్ మీద పడినట్లనిపించి "కెవ్వు మని అరిచింది" సమన్విత , అయినా కార్ ఆపకుండా వేగం మరింత పెంచాడు హిమాన్ష్ , ఇదంతా ఆ దెయ్యం చేసే పని అని అనుకుంటూ. అంత గాలి వాన లో కూడా తమ గుండె చప్పుడు స్పష్టంగా వినపడుతోంది. ఇంక 2 కిలోమీటర్ల దూరం ఉంది ఉన్నట్లుండి పెద్ద సెభ్ధం వచ్చి కార్ ఆగిపోయింది, ఎంత స్టార్ట్ చేసినా స్టార్ట్ అవ్వడం లేదు దిగి అంతా పరీక్షించాడు అంతా బాగానే ఉంది కాని కార్ కదలడం లేదు ఇంక ఆలస్యం చేయకూడదు అని కార్ దిగి కొబ్బరికాయ , విభూది తన చేతిలోకి తీసుకొని సమన్విత పరిగెడుతుంటే , పాపని తీసుకొని తన వెనక హిమాన్ష్ పరిగెడుతున్నాడు ఇంతలో ఎవరో హిమాన్ష్ ని వెన్నక్కి లాగేస్తున్నట్లు వెనక్కి వెనక్కి వెళ్లిపోతున్నాడు గుడి దగ్గరకి సమీపించే సరికి అమావాస్య ఘడియలు ప్రారంభమయ్యాయి అంతే ఒక్కసారిగా తన బంధం నుండి విడిపించుకొని గెట్టిగా అరుస్తూ ఆ స్వామిజీని చంపి అతని శరీరంలోకి ప్రవేశించి గుడిదగ్గరకి వచ్చింది ఆత్మ తెల్లటి శరీరంతో నల్లటి కళ్ళు పొడవాటి గోర్లు జుట్టంతా విరబోసుకొని , అప్పటికే సమన్విత గుడిలో కొబ్బరికాయ కొట్టేసింది. హిమాన్ష్ గుడిలోపలకి అడుగు పెట్టబోతుండగా మరలా వెన్నక్కి లాగింది ఆ దెయ్యం , ఒక్క దెబ్బకి వెనక్కి ఎగిరి చెరువు దగ్గర పడ్డాడు హిమాన్ష్. వెంటనే తన చేతిలోని విభూది హిమాన్ష్ కి విసరబోయింది సమన్విత అంతలో హిమాన్ష్ మెడ ని తన చేతులతో గట్టిగా పట్టుకొని పైకి ఎత్తి గిరా గిరా తిప్పుతుండగా ఆ విభూది చెయ్యి జారి కింద పడిపోయింది. "మా ఆయనని ఏం చేయొద్దు దయచేసి నీకు దణ్ణం పెడతాను అంటూ ప్రాధేయపడింది" సమన్విత. "అవునా అయితే నువ్వు ఆ గుడిలోనుండి బయటకు రా నాకు కావలసింది నీ ప్రాణం అని అరుస్తూ తనని సమీపిస్తూ నడిచింది" ఆ దెయ్యం. కానీ గుడిలోకి అడుగుపెట్టలేక పోయింది "నువ్వు బయటకి రాకుంటే నీ భర్తని చంపేస్తాను అని తన చేతి గొర్లతో హిమాన్ష్ మొహంపైన రక్కుతూ అతని వేళ్ళని ఒక్కొక్కటిగా విరుస్తూ , కింద పడేసి తన పైన కూర్చొని తన పొడవాటి గొర్లతో ఒళ్ళంతా రక్కడం మొదలుపెట్టింది". హిమాన్ష్ మాత్రం నువ్వు అక్కడే ఉండు బయటకి రావద్దు అంటూ అరుస్తున్నాడు . కానీ భర్త మీద ప్రేమతో బయటకి రావాలని ఒక్కొక్క అడుగు ముందుకు వేయసాగింది. "వద్దు సమన్విత ప్లీస్ నేను చెప్పేది విను నువ్వు బయటకు రావద్దు అని అరుస్తూనే ఉన్నాడు" హిమాన్ష్ . ఇంతలో గుడినుండి బయటకి వచ్చేసింది సమన్విత. వెంటనే హిమాన్ష్ ని తన కాలితో పక్కకు తన్ని సమన్విత మెడ పట్టుకుంది ఆ దెయ్యం. ఇంతలో తన చేతిలో ని బిడ్డ ఏడవడం మొదలుపెట్టడంతో "ఓహ్ బిడ్డని కూడా కన్నావా ! అయితే ముందు దీనినే చంపుతాను అని బిడ్డని సమన్విత చేతిలోనుండి లాక్కుని తన గొర్లతో పాప కంఠం లోకి గుచ్చబొయింది". అంతలో ఆగు ప్రియ అని ఎంతో ప్రేమతో పిలుస్తాడు హిమాన్ష్ ఆ పిలుపు విని ఒక్కక్షణం ఆగిపోయింది దెయ్యం. "ఆ పిలుపు ఎంత బాగుందో హిమాన్ష్ ఇంక్కొక్కసారి నన్ను ప్రేమగా ప్రియ అని పిలవవూ అని అంటుంది" దెయ్యం. పిలవడమే కాదు ప్రియ నీతో ఒక విషయం చెప్పాలి అని దగ్గరకి రాబోయాడు హిమాన్ష్ అది గమనించి "పాప పీక గట్టిగా పట్టుకొని పైకి లేపింది దగ్గరకి రావొద్దు అని అరిచి పాప పీక పిసక బోతుండగా" !. నీ కన్న బిడ్డని నువ్వే చంపుకుంటావా ప్రియ అడిగాడు హిమాన్ష్ ?. దాంతో ఆశ్చర్యంగా హిమాన్ష్ వైపు చూసి "ఏంటి నువ్వు చెప్పేది ఇది నా పాప ! ఏంటి నమ్మకం ? అసలు నాకు పాప పుట్టిందని నీకెవరు చెప్పారు?" అని అడిగింది కొంచెం ఆవేశం తగ్గించి. నేను నువ్వు ఎంత ఘాడంగా ప్రేమించుకున్నామో నీకు తెలుసు , కానీ మా ఇంట్లో మన విషయం తెలిసి , నాకు వేరే వాళ్ళతో పెళ్లి నిశ్చయమైంది అని చెప్పి ఊరి నుండి తీసుకెళ్లిపోయారు. ఆ విషయం నీకు ఉత్తరం రాసి చెప్పాను , కానీ నువ్వు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నేను మోసం చేశానని భావించి ఆత్మహత్య చేసుకున్నావు . ఆ తరువాత మా వాళ్ళతో మాట్లాడి మన పెళ్లికి ఒప్పించి మీ ఇంటికి వచ్చే సరికి నువ్వు ఆత్మహత్య చేసుకున్నావని మీ అమ్మ గారు చెప్పారు. అప్పుడే మీ అమ్మ గారి చేతులో ఈ బిడ్డని చూసాను , ఎవరు ? అని అడిగితే మన ప్రేమకి గుర్తుగా పుట్టిన పాప అని చెప్పారు. ఆ క్షణమే నిర్ణయించుకున్నాను ఈ పాప నా ప్రాణం అని తరువాత నిన్ను తలుచుకొని ఎన్ని రోజులు ఏడ్చానో తెలుసా నేను కూడా చనిపోవలనుకున్నాను కానీ మన పాప కోసం బ్రతికున్నాను తనలోనే నిన్ను చూసుకుంటూ బ్రతికాను. తరువాత కొన్ని రోజుల్లోనే మా ఇంట్లో నాకు పెళ్లి చేయాలని పట్టుబట్టారు అప్పుడే ఈ సమన్విత తో నాకు పెళ్లి జరిగింది. మొదటి రాత్రే ఆమెతో మన విషయం మన పాప విషయం చెప్పాను , ఎంతో ఆనందంగా పాప ని , నన్ను స్వీకరించింది. అది కూడా కాకుండా మన పాప కోసం తాను పిల్లల్ని కనకూడదని నిశ్చయించుకుంది. ఇప్పుడు చెప్పు నీ కన్న కూతుర్ని నువ్వే చంపుకుంటావా? అని అడిగాడు . "చిన్నగా ఆ పాప ని కిందకి దించి తనివితీరా ముద్దులు పెట్టుకుని గుండెలకి హత్తుకుని , నన్ను క్షమించు హిమాన్ష్ నువ్వు నాకు దక్కలేదన్న కోపంలో నువ్వు కావాలనే నన్ను వాడుకొని వదిలేశావనుకొని ఆరోజు ఆత్మహత్య చేసుకుని పొరపాటు చేసాను. తరువాత నువ్వు ఎప్పుడెప్పుడు ఈ ఊర్లో అడుగుపెడతావా అని ఎదురుచూసాను. ఉన్నట్లుండి ఒకరోజు నువ్వు వచ్చి నా సమాధి ఉన్న చోటనే స్థలం కొని అక్కడే ఇల్లు కంటించుకున్నావు , తరువాత భార్య , బిడ్డతో కనపడేసరికి నాలో దాగి ఉన్న కోపం కట్టలు తెంచుకుని వచ్చి నిన్ను చంపేయాలన్నంత కసి పెరిగింది. అందుకే ఇన్ని రోజులు మిమ్మల్ని ఎంతో ఇబ్బంది పెట్టాను. నన్ను క్షమించు అని చివరిసారిగా తన పాప ని ముద్దాడి అక్కడి నుండి ఆత్మ విడిపోయి గాలిలో కలిసిపోయింది.


Rate this content
Log in

More telugu story from gowthami chavala

Similar telugu story from Horror