శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Tragedy

5.0  

శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Tragedy

28.ఆత్మబంధువు

28.ఆత్మబంధువు

2 mins
180



     నా అహం నన్ను నిలువునా . చేజేతులా నా జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నాను. మోకాళ్లపై తల పెట్టుకుని తనను తానే నిందించుకుంటుంటే... కళ్ళల్లో కన్నీరు నిండుకుంటుంది భూమికకు. 


     ఎంతో ఆప్యాయంగా పలకరించిన అతని రూపమే మెదులుతుందిప్పుడు ఆమె కళ్ళకు. 


     రైతుబజార్లో...కూరలు ఎంచుకుంటుండగా  "హలో మేడం" అని పిలిచిన ఆ అపరిచిత వ్యక్తిని చూసి...చిన్నగా తడబడింది భూమిక.

      

     "నేనెవరో మీకు తెలియకపోయినా ...మీరెవరో నాకు బాగా తెలుసు. చెప్పాడు అతను.

      

    "ఇంతకీ మీరెవరు? నాకు గుర్తురావడం లేదు" ఎవరై ఉంటారా అన్నట్టు ఆలోచిస్తూ అడిగింది భూమిక.

     

     నా పేరు ఆకాష్. ముఖాముఖి మీరెప్పుడూ నన్ను చూడలేదు. మనం కలిసి మాట్లాడుకోలేదు. ఓరోజు మా నాన్నగారు మీ ఫోటో చూపించి...ఈ సంబంధం ఖాయం చేస్తున్నామని చెప్పారు . ఫొటోలోనే మీరెంతో తెల్లగా బాగున్నారు. ఇక ఎదురుగా చూస్తే ఇంకెంత బావుంటారో అనుకుని వెంటనే...మీ ఇష్టం నాన్నగారూ అని చెప్పేసాను. లోపలి ఆనందాన్ని కనిపించనీయకుండా. ఆ మర్నాటి నుంచి మిమ్మల్ని చూడాలనిపించి మీకు తెలియకుండా ఫాలో చేస్తూనే వున్నాను. అలా మీపై ఎంతో ప్రేమ పెంచుకున్నాను. కానీ...మన పెళ్లికి దారితీయలేదు. దానికి కారణం నేను నల్లగా ఉంటానని మీఇంట్లో వాళ్ళు అనుకోవడంతో....కనీసం నా ఫోటో అయినా మీరు చూడకుండా నన్ను తిరస్కరించారని. ఇది జరిగి ఐదేళ్లు గడిచిపోయింది కదా...మీరు మరిచిపోయుంటారు" అంటూ అక్కడ నుంచి నిష్క్రమించాడు ఆకాష్.


   అతని మాటలతో గతం గుర్తుకొచ్చింది భూమికకు... 

   పదే పదే తలపుకొస్తున్నాడు ఆకాష్. 

   ఆనాడు నేను తిరస్కరించింది ఇతన్నేనా? నల్లగా వున్నా ఎంత కళగా వున్నాడు..! ఎంతో తెల్లగా అందంగా వుండే రాజేష్ నామనసులో ఉండటం వల్ల...ఇంట్లో వాళ్ళు ఏ అబ్బాయి ఫొటో చూపించినా ఏదో ఒక వంకతో... తోసిపుచ్చేదాన్ని. కానీ చివరికేమైంది....? రాజేష్ నన్ను కాదని గొప్పింటి సంబంధం చేసుకున్నాడు. ఆనాడే ఆ ప్రేమ జోలికి పోకుండా...నాన్న ఆకాష్ ని చేసుకోమని ఎంతగానో బ్రతిమలాడినప్పుడైనా చేసుకుని ఉంటే....నా జీవితం చేజారిపోకుండా వుండేది . తెల్లగా అందంగా ఉన్నాననే నా అహం...నా కళ్ళకు చీకటిపోరలు కప్పేసింది అనుకుంటూ కుంగుబాటుకు గురయ్యిందిప్పుడు భూమిక. 


   ఇప్పుడు ఆకాష్ ఓ ఇంటివాడై పిల్లలతండ్రి కూడా అయ్యుంటాడు. అతన్ని పెళ్లి చేసుకున్న అదృష్టవంతురాలు ఎవరో ...? ఇతన్ని చేసుకుని ఉండి వుంటే నాన్న కోరిక కూడా తీరేది. నేను ప్రేమలో మోసపోయిన పాపానికి.... తలెత్తుకోలేక ప్రాణాలు తీసుకున్నారు. నాలాంటి వాళ్లు తల్లిదండ్రులకు చెడ్డపేరు తేవడానికే పుడతారనుకుంటాను. అందంగా ఉంటే...అహంకారం తోడవుతుందని నా అనుభవంతోనే తెల్సుకున్నాను...భూమిక తనను తాను నిందించుకుంటూ...కళ్లనీళ్లు పెట్టుకుంది. 


   కానీ భూమికకు తెలీదు....ఇంకా పెళ్లి కాకుండా ఉండిపోయిన ఆకాష్ ఆత్మబంధువై ...చేజారిన తన జీవితానికి చేయూత నివ్వడానికే మరో ప్రయత్నం చేస్తూ తనను కలిసాడని...!!


     ***          ***          ***




      


      


     

     


Rate this content
Log in

Similar telugu story from Tragedy