శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Tragedy

5.0  

శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Tragedy

22.చీడపురుగు

22.చీడపురుగు

2 mins
213    వ్యసనం ఎంతటి మనిషినైనా... దిగజార్చేస్తుందేమో....? రైల్వే స్టేషన్లో లోకల్ ట్రైన్ కోసం ఎదురుచూస్తుండగా రాజేష్ కనిపించేసరికి మనసులో అనుకున్నాడు ఆకాష్.


   అప్పటికే రాజేష్ కొద్దిగా మందుమీద ఉన్నట్టున్నాడు. కిటకిటలాడుతున్న జనంలో మనుషులకేసి చూస్తూ అటూ ఇటూ తిరుగుతున్నాడు. తాను ఎర చూపించడానికి ఎవరు దొరుకుతారా అని....! అతను గడిపే నీఛపు బ్రతుకుని తల్చుకుంటుంటే...చాలా చిరాకేసింది ఆకాష్ కి. వీడిదీ ఒక బ్రతుకేనా...? అనే ఏహ్యభావం చోటుచేసుకుంది మనసంతా.


   బాగా డబ్బున్నవాడినీ...ఆడదంటే వీక్నెస్ ఉన్న మగాడినీ ఇట్టే పట్టేస్తూ ఉంటాడు. ఈరోజు మరలాంటివారెవరూ తగలకపోవడం వల్లేమ్మో...పరిచయమున్న ఆకాష్ కనిపించేసరికి...అటుగా అడుగులు వేసాడు రాజేష్.


  అంతే...ఆకాష్ ఒక్కసారిగా అదిరిపడి...వాడి కళ్లనుంచి తప్పించుకోవాలనుకున్నాడు. కానీ ఆ ఛాన్స్ ఇవ్వలేదు రాజేష్. ఒక్క అంగలో అతడిని చేరుకుని భుజంపై చెయ్యేసాడు.

   

  "హలో రాజేష్ ఏంటి విశేషం..."? ఏడవలేక పైకి నవ్వుతూ అడిగాడు ఆకాష్.


  తన ఊహించినట్లుగానే.. " నాకు అర్జెంటుగా డబ్బు కావాలి. కానీ నాకు అప్పుగా తీసుకోవడం ఇష్టం లేదు నువ్వు ఊ అంటే ఒక్కసారి మా ఇంటికి రా" .బ్రతిమిలాడాడు

రాజేష్.  


  అది విని...ఆకాష్ లో ఆవేశం చిర్రెత్తుకొచ్చింది. 


  "ఎప్పుడూ ఎదుటివాడి జేబు మీదే నీ చూపు. ఇతరుల మీద ఆధారపడి బ్రతకాలి అనుకొనే నీలాంటి వెధవల్ని ఉరి తీయాలి. సానుభూతి చూపించడం మహా పాపం" అంటున్న ఆకాష్ వైపు నమ్మశక్యం కానట్లు చూస్తూ ఉండిపోయాడు...తన గురించి ముందే తెలుసుకుని ఉంటాడని ఊహించని రాజేష్. 


   అలా ఉండి పోయిన రాజేష్ కు కర్తవ్యాన్ని బోధ పరుస్తూ..." చూడు ఇద్దరం స్నేహితులమై ఉండి కూడా నేను నీ నుంచి దూరంగా ఉండడానికి కారణం నీ ప్రవర్తన. నీగురించి నా భార్య భూమిక చెప్తే తెలిసింది. నీభార్య అనసూయ ఎప్పటికప్పుడు తన కన్నీటి గాధలు వినిపిస్తూనే ఉంటుంది నాభార్య భూమికకు. పడుపువృత్తి చేయిస్తూ...తనని నానా చిత్రహింసలూ పెడుతున్నావని. తాగుడు, డ్రగ్స్ మైకంలో మునిగిపోయి శాడిస్ట్ లా ప్రవర్తిస్తున్నావని...బాధ పడనిరోజంటూ లేదు. ఇక తనకు చావే శరణ్యం అనుకుంటుందనీ...మీ ఫ్రెండ్ రాజేష్ కి మీరే బుద్ధి చెప్పి...సరైన దారికి తీసుకురావాలంటూ.... ఎన్నోసార్లు చెప్తూనే ఉంది భూమిక. నీ స్వవిషయం కదాని పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు నువ్వు నా దగ్గరికే వచ్చి ఇంటికి రమ్మంటున్నావంటే నాకు చెల్లెలు లాంటి నీ భార్యను కిరాయి ఇద్దామనే నీ పాడు బుద్ధి ఏమీ బాగోలేదు"... కటువుగా దులిపేసాడు ఆకాష్.


   ఆకాష్ మాటలకు చలించలేదు రాజేష్.


   "అవును నా ఉద్దేశం అదే. నాకు ఉద్యోగం లేదు ఆస్తులు అంతస్తులు లేవు. నా బాధలు నీకెలా అర్థం అవుతాయి ...? కడుపు నిండాలంటే అందరూ నా భార్య కర్పించే డబ్బుతోనే మా కడుపు నింపుకుంటూ జీవితం వెళ్లదీస్తున్నాము" అన్నాడు ఏదో ఘనకార్యం చేస్తున్నట్టు.


  " ఛీ...నీకు సిగ్గులేదూ...? నీ వ్యసనాల కోసం ...నిన్ను నమ్ముకుని నీ వెంట వచ్చిన భార్యతో వ్యాపారం చేయిస్తూ...కడుపునింపుకోవడం ప్రసాదం అనుకుంటున్నావేమో...? అది అశుద్ధంతో సమానం. వ్యసనం మనిషిని ఎంత హీనస్థితికైనా దిగజారుస్తుందని నిన్ను చూసాక అర్థమయ్యింది. నువ్వు నాకంటికి అసలుకనిపించకు. నాదగ్గర నుంచి పో ముందు" అంటూ గట్టిగా అరుస్తున్న ఆకాష్ మాటలకు అక్కడ నలుగురూ పోగయ్యారు. 


  విషయం తెలుసుకున్న వారంతా...తనని అసహ్యంగా చూడ్డంతో....తాగుడు మైకంలో కూడా వ్యసనపరుడైన రాజేష్ కి తప్పుచేస్తున్నానన్న విషయం తెలుస్తూనేవుంది. 


  కానీ...ఆభావన ఆక్షణం వరకే. మళ్లీ మామూలే. వ్యసనం మనిషిలోని ఆమూలాన్ని అంత త్వరగా అంతరించలేదు. అదొక చీడపురుగు లాంటిది కావడం వల్లనేమో....!!*     ***           ***         ***
   

 


Rate this content
Log in

Similar telugu story from Tragedy