Venkata Rama Seshu Nandagiri

Abstract Inspirational

4  

Venkata Rama Seshu Nandagiri

Abstract Inspirational

2020లో నా గమనం

2020లో నా గమనం

1 min
372


2020 శార్వరి నామ సంవత్సర ఉగాది పండగ కరోనా వలన లాక్డౌన్ విధించ బడడంతో ఎవరింట్లో వారే చేసుకోవడం జరిగింది. తెలుగు సంవత్సరాది ఒంటరితనంతో ప్రారంభమై సంవత్సరమంతా ఎవరికి వారే యమునాతీరే అన్నవిధంగా గడిచింది. 

ఈసంవత్సరంలో అతిమంచి లేక అతిచెడు విషయాలు జరిగాయి. దాదాపుగా కోటి మందికి పైగా కరోనా వైరస్ బారిన పడ్డారు. లక్షలాది ప్రజలు, ఆత్మీయులు మృత్యువాత పడడం నిజంగా ఎంతో బాధని కలిగించింది. భయం భయంగానే ఈసంవత్సరమంతా గడిచింది.

ఇంట్లో మనవలు, ఆన్లైన్ చదువులు, వారికి సహకరించడం లాంటి పనులెన్నో పెరిగాయి. అయినా రచనా సామర్థ్యం పెంచుకోగలిగాను.

కథలు, కవితలు వంటి రచనా వ్యాసంగాలలో పాల్గొంటూ సమూహాలలో చురుకుగా ఉన్నాను. మన స్టోరీ మిర్రర్ లోనే 200 పైన కథలు, కవితలు , సూక్తులు రాయగలిగాను.

ఆథర్ ఆఫ్ ది వీక్, ఆథర్ ఆఫ్ ది ఇయర్ 2019, 2020 లో కూడా ఎన్నుకోబడ్డాను. ఈవిషయంలో స్టోరీమిర్రర్ నిర్వాహకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అన్ని విషయాలలో తోడ్పాటు నందిస్తూ, ప్రతివిషయంలో సహకరించిన కార్యనిర్వాహక సభ్యులు, తోటిరచయితలకు మనఃపూర్వక ధన్యవాదాలు.  

నాకవితలను, కథలను, సూక్తులను ఆదరించిన పాఠకులకు నేనెంతో ఋణపడిఉన్నాను. వారివలననే నేను ఇంత వరకు రాగలిగాను. ఇకముందు కూడా ఇదేవిధంగా ఆదరిస్తారని ఆశిస్తున్నాను.

2021 సంవత్సరం ఉత్సాహభరితంగా ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా అందరికీ ఆరోగ్యం, ఆనందం కలగాలని కోరుకుంటున్నాను

ఈవిషయాలన్నీ మీఅందరితో పంచుకొనే అవకాశమిచ్చిన స్టోరీమిర్రర్ నిర్వాహకులకు, ధన్యవాదాలు.



Rate this content
Log in

Similar telugu story from Abstract