శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Tragedy


4.2  

శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Tragedy


16.మృగాడు

16.మృగాడు

1 min 127 1 min 127


           

            

   మనసులేని మనిషిని పెళ్లిచేసుకున్నానని అనుకుంటూ ఉంటుంది భూమిక. కానీ...ఈరోజు భర్త ఆకాష్ ఆఫీసు నుంచి ఫోన్ చేసి...ఓ మాట అడిగేసరికి...సిగ్గుతో ముడుచుకుపోయింది. అంతలోనే ఎంతో ఆశ్చర్యం ...


   భర్తలోని ఆమార్పుకి నివ్వెరపోక ఏమవుతుంది మరి...? ఏంటీ ఈరోజు ఇంత సడన్ గా ఈయన గారిలో చలనమొచ్చింది అనుకుంది. ఏది ఏమైనా తన మంచికే అనుకుని సంబరపడిపోయింది.

    

   సాయం సంధ్య...!

   

  తెల్లటి చీరలో...మల్లెల గుభాళింపుతో ...తన అందానికి మెరుగులు దిద్దుకుని భర్త ఆకాష్ కోసం ఎదురుచూస్తూంది భూమిక. భర్త ఒడిలో సేద దీరే భాగ్యానికి ఎన్నాళ్ళుగా కలలు కన్నదో...? ఆ కల నిజమయ్యే సుదినం ఈరోజు అయినందుకు...నమ్మలేని నిజాలంటే ఇవేనేమో అనుకుంది.


   ఆకాష్ ఓ చిత్రకారుడు. ఒక ప్రయివేటు కంపెనీలో ఉద్యోగం చేస్తూ...చేయి తిరిగిన చిత్రాలు గీస్తూవుంటాడు. ఒకసారి చూస్తే చాలు...కళ్ళు మూసుకుని గీసేటటువంటి కళ ఉంది అతని చేతిలో. అతని చిత్రాల్లో జీవకళ ఉట్టిపడ్డంతో...జాతీయస్థాయిలో ఎన్నో బహుమతులు అందుకున్నాడు. అతనికి అంత కీర్తి ప్రతిష్ఠలున్నా...ఒక మగాడుగా భూమికను ఏనాడూ దగ్గరకు తీసుకోలేదు. భర్త ప్రవర్తన జీవితాంతం ఒక సమస్యగానే మిగిలిపోతుందని కుమిలిపోయేది. 


   కానీ ఈరోజు తన భర్తకు తనపై దయ కలగడమే...తనకు పెద్ద ఆశ్చర్యం.


   కాలింగ్ బెల్ మోగడంతో...చెంగున లేచి వెళ్లి తలుపు తీసింది భూమిక. భార్యను చూస్తూనే ముఖం చిట్లించాడు. ఎప్పటిలాగే.. దూకుడుగా...చిరాగ్గా లోనికెళ్ళిపోయాడు. భర్త వాలకం చూసి భూమిక హుషారంతా ఆవిరైపోయింది. 


   కొన్ని నిమిషాల అనంతరం...భూమికా అంటూ పెద్దగా అరిచాడు ఆకాష్. ఆ అరుపుకు బెదిరిపోయింది. ఒళ్ళంతా ఒకటే చమటలు. తానేం తప్పు చేసిందో అర్థం గాక...అదిరే గుండెలతో...భర్త ముందుకెళ్లింది. 


   నేను వచ్చేసరికి...నీ నగ్నత్వం చూడాలి అంటే...నిన్నిలా సింగారించుకోమని కాదు. నువ్వెంతగా నన్ను కవ్వించాలని చూసినా...నేనింతే. నువ్వు నాకు నగ్నంగా కనిపిస్తే చాలు అంటూ గట్టిగా గద్దించాడు. 


   ఆ అరుపుకు భయపడిపోయి...భర్తలోని ఆ వెర్రికోరిక అర్థం కాక బిక్కచచ్చిపోయి అలా నిల్చుండిపోయింది భూమిక.


  చెప్తుంది నీకే...అర్థం కాదా...? మరోసారి హెచ్చరించాడు. భర్త ఉగ్రరూపాన్ని చూసి బెదిరిపోయింది . వణుకుతున్న భూమిక చేతులు ... తన చీర కుచ్చెళ్ళు మీదకి వెళ్లాయి...


   కానీ...తన నగ్నదేహాన్నే చిత్రంగా గీసి...ఓ పార్టీకి భేరం పెట్టబోతున్న ఆ మనసులేని మనిషి వికృత ఆలోచనా తెలీదు ... మగాడు కాని మృగాడనీ తెలీదు పాపం భూమికకు....!!*


    ***             ***              ***    


      


Rate this content
Log in

More telugu story from శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Similar telugu story from Tragedy