STORYMIRROR

శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Drama

4.5  

శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Drama

10 స్వార్థం

10 స్వార్థం

2 mins
770



   

    మిత్ర ద్రోహం చేస్తున్నానేమో...? ఆ తలంపుతో రాజేష్ మనసు కుదురుగా లేదు.


    అసలు ఆకాష్ నన్ను ఆ మాట అడక్కుండా ఉండాల్సింది . వాడు నా స్నేహితుడైన మాత్రాన్న అంతస్తుల్లో నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. పైగా ఒక కులం కూడా కాదు. అలాంటి వాడి చెల్లెలితో నా పెళ్లెలా అవుతుందని ఆశించాడు...? కోరికలు కోరడానికైనా ఒక హద్దు ఉండాలి . ఎంత స్నేహితుడు అయితే మాత్రం ఇంట్లో ఒప్పుకుంటారని ఎలా అనుకున్నాడు...? ఆకాష్ మాటల్ని మనసులోనే తలచుకుని తెగ బాధపడుతున్నాడు.


   "ఒరే రాజేష్ నువ్వు ఏమీ అనుకోకపోతే ఒక మాట అడుగుతాను మన స్నేహాన్ని బంధంగా మార్చుకోవాలనుకుంటున్నాను. నీకెలాగూ బోలెడు ఆస్తుంది. మేమైతే రూపాయి కూడా ఖర్చుపెట్టి పెళ్లిచేయలేని పరిస్థితి. నా చెల్లెల్ని నువ్వు పెళ్లి చేసుకోరా . మమ్మల్ని ఆర్థికంగా ఆదుకున్నట్టు ఉంటావు . ఓ ధనవంతుడికీ.... ప్రాణ మిత్రుడైన ఓ మంచి వాడికీ నా చెల్లెలు నిచ్చి పెళ్లి చేశానన్న ఆనందం నాకూ అంటుంది. నీకిష్టమేనా..."? అడిగాడు ఆకాష్. 


   స్నేహితుని మాట విన్నాకా...ఒక్క క్షణం అదిరిపడ్డాడు. కానీ అదేమీ కనిపించనీయకుండా... మిత్రుని మాటలకు నవ్వేసాడు రాజేష్గ్.


   అలాగేరా...తప్పకుండా. నువ్వు నన్ను కోరి మరీ నీ చెల్లెల్ని ఇస్తానంటే ఎలా కాదంటాను. ఇంట్లో అమ్మా నాన్నల్ని కూడా ఒక్క మాటాడుగుతాను అన్నాడు.


   స్నేహితుడు నుంచి ఆ చిన్న మాటవచ్చినందుకే ఎంతో ఆనందపడిపోయాడు ఆకాష్.


   తన మనసులో ఉన్న మావయ్య కూతుర్ని పె

ళ్ళిచేసుకుంటే... అంతస్థుల తేడా ఉండదు. ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఆనందంగా మాపెళ్లి చేస్తారు. స్నేహానికి విలువిచ్చి వీడి చెల్లెల్ని చేసుకుంటే...పెళ్లీడుకొచ్చిన నా చెల్లెలుకి మంచి సంబంధాలు రావడం వెనకపడతాయి. మా స్నేహం పాడవ్వకుండా ఆకాష్ కి ఏదో ఒకటి చెప్పి నామీద ఆశలు పెట్టుకోనీకుండా చేయాలి అనుకున్నాడు రాజేష్.


   పదిరోజులు పోయాకా..

   

   "సారీరా...మీ చెల్లిని చేసుకోవడానికి మాతల్లిదండ్రుల్ని ఒప్పించలేకపోయాను. పెద్దవాళ్ళని కాదని ఈపెళ్లి చేసుకునే కంటే ఆగిపోవడమే మంచిదనిపిస్తుంది. వాళ్ళని కాదని చేసుకుంటే తర్వాత మామధ్య వచ్చే మనస్పర్ధలు తట్టుకోలేనని చెప్పేసాడు రాజేష్. 


    "పర్లేదులేరా...నేను తొందరపడి అడిగానేమో నిన్ను. ఏమీకోకు" అన్నాడే గానీ...

    

   త్వరలో నీచెల్లి భూమికా నేను పెళ్లిచేసుకోబోతున్నామన్న విషయం నీకు తెలిస్తే...నీవెలా రియాక్ట్ అవుతావోననే... నాచెల్లి పెళ్లి వంకతో నిన్ను కదిపాను. ఇన్నేళ్ల మన స్నేహంలో... స్నేహంకంటే...ఆస్తులే నీకు ముఖ్యమని నాకూ తెలుసు. మా ప్రేమ విషయం చెప్తే ఎంత స్నేహితుడువైనా నువ్వూ శత్రువుగానే మారిపోతావు. అందుకే... నా స్వార్థంతో నీకు చెప్పలేకపోతున్నాను. అపరాధభావంతో... రాజేష్ కి మిత్ర ద్రోహం చేస్తున్నాననే అనుకున్నాడు ఆకాష్ కూడా....!!*

    


       ***         ***          ***

   


  


Rate this content
Log in

Similar telugu story from Drama