శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Tragedy

5.0  

శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Tragedy

1.వధువు కావలెను

1.వధువు కావలెను

2 mins
514


              


   కాలం మిగిల్చిన గాయమే...పోయేది కాదు తన బ్రతుకంతా అనుభవించాల్సిందే పాపం భూమిక...! 

   

   ఈ పెళ్లితో తానొక ఇంటిదాన్ని అవుతున్నందుకు ఎంతో సంబర పడింది. తల్లిదండ్రులకు తానొక భారం కాకూడదనేగా...తనేంతగానో ప్రయత్నించి...తనకు తానుగా వరుడ్ని వెతుక్కుంది. జీవితాంతం తోడుంటాడనుకున్న భర్తే...ఇంత దారుణానికి ఒడికడితే....స్త్రీ జాతికి రక్షణ ఎక్కడ...? అడుగడుక్కీ మోసపోతూనే...గడిచే కాలంతో కొట్టుకొస్తూ గాయాల పాలైవుతున్న నాలాంటి స్త్రీలెందరో...? 


   ఆడుతూ పాడుతూ సాగిన సంతోషాలన్నీ...కాలం మింగేసింది. తనకేం మిగిలిందని...? భూమిక విరక్తితో కూడిన ఎర్రి చూపులు చూస్తూ ... తన రోజులు బాగోలేదనుకుంది. చేసేదిలేక నిస్సహాయులైన ఎవరైనా  కాలం మీదకే నిందను తోసేయడం సహజమే కదా...! 


   భూమిక ...ఈ పరిస్థితికి రావడానికి కారణం తెలుసుకోవాలంటే.... కొన్ని రోజుల వెనక్కి వెళ్లాల్సిందే....!

   

   ఎంబీఏ ప్రయివేటుగా చదివి...ముంబాయి నగరంలో బిజినెస్ చేస్తూ కనీసం నెలకు యాభై వేలు ఆదాయం పొందుతూ కట్నకానుకలు, కులప్రసక్తి లేని ఆదర్శభావాలున్న వరునికి అందమైన వధువు కావలెను. ఫోటో వివరాలతో...పోస్ట్ బాక్స్ నెంబర్ 603, జనప్రియ దినపత్రిక పంపండి.


  జనప్రియ పత్రిక తిరిగేస్తున్న అందాల భూమికను వివాహబంధం శీర్షికలో ఆప్రకటన ఆకట్టుకుంది. తన పేదతనానికి ఇంతకంటే అవకాశం రాదని నిర్ణయించుకుని... కాగితం కలాన్ని చేతిలోకి తీసుకుంది.


   తనకున్న అర్హతలు చెప్తూ భూమిక రాసిన ఉత్తరానికి వెంటనే జవాబు వచ్చింది...వరుడు నుంచి. 


    భూమిక గారికి, 

   జనప్రియ ద్వారా ...మీ బయోడేటా, ఫోటో అందాయి. ఫొటోలో మీరు నచ్చారు. త్వరలో ఈ విషయమై హైదరాబాద్ వచ్చి కలుస్తాను. 

                   మీరు కోరుకునే,

                     ఆకాష్.


   ఉత్తరం చదివిన భూమిక సంతోషంతో తబ్బిబ్బయ్యింది. ఉత్తరం కేసి తేరిపారా చూసింది. ఆచూపులో వసంతాలు వెల్లివిరిసాయి. తన కష్టాలు కడతేరతాయనే సంభ్రమంతో భూమిక మనసు అనేక విధాలా పరుగులు తీసింది. ముంబాయి నగరంలో తన సంసార జీవితం గురించి ఊహిస్తూ... ఆకాశ వీధుల్లో విహరించింది.


           *     *    *   *


    టాక్సీ రివ్వున దూసుకుపోతుంది. రోడ్డుకిరువైపులా పెద్ద కట్టడాలతో బిల్డింగులు. అంత పెద్ద సిటీకి ఎప్పుడూ రాని భూమిక వింతగానూ, ఆశ్చర్యంగానూ ముంబాయి నగర సౌందర్యాన్ని ముగ్దురాలై వినోదిస్తుంది. మనసులో కోటిరాగాలు ఎదమీటగా...భర్తవైపు చూసింది. ఆమె అమాయకపు చూపులో ప్రేమ,ఆప్యాయత, అనురాగాలు కొట్టొస్తూ కనిపించాయి. 


    టాక్సీ ఓ భవంతి ముందు కీచుమంటూ ఆగిన శబ్దానికి ఈలోకంలోకి వచ్చింది. ఆ భవనాన్ని చూడగానే భూమిక కళ్ళు అచ్చెరువొందాయి. నూతన వధువై ఆఇంటి గుమ్మాన్ని కుడికాలు మోపి గృహప్రవేశం చేసింది.


            *   *   *   *   *


   భూమిక మంచంపై బోర్లా పడుకుని వెక్కివెక్కి ఏడుస్తుంది.కలలు కననేర్చిన ఆకళ్లకు లోకంలో ఉన్న  కిరాతకత్వమంతా ఒక్కసారిగా కనిపించింది. ఆ షాక్ కి ఆమె గుండెలు బద్ధలవుతున్నాయి. 


   ఆకాష్ ఎంత అందమైన పేరు. పదికాలాల పాటూ అతనితో అన్యోన్యంగా గడుపుదామనుకున్న ఓ ఆడపిల్లను లక్ష రూపాయలకు రెడ్ లైట్స్ ఏరియాలో అమ్మగలిగిందా పేరు.


   భూమిక ఏడుస్తూనే ఉంది. వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉంది...!
Rate this content
Log in

Similar telugu story from Tragedy