STORYMIRROR

Gayatri Tokachichu

Classics

3  

Gayatri Tokachichu

Classics

యోగులు -భోగులు

యోగులు -భోగులు

1 min
170

యోగులు -భోగులు

(బాలపంచపదులు )


నిత్యము నిష్టగ నుండెడి యోగులు

సత్యాన్వేషణకై తపించు మౌనులు

పరతత్త్వాన్ని బోధించు గురువులు

ధరలో శాంతిని నిల్పు సజ్జనులు

వారిని భక్తిగ పూజించు విజయా!//


ముక్త సంగులైనట్టి మోక్షగాములు

త్యక్త భోగమతులైన సాధువులు

వైరాగ్య భావనా కలిత దీప్తులు

పరోపకార పరాయణాసక్తులు

వారికి వందనాలిడుము!విజయా!//


గృహస్థాశ్రమంలో నుండెడి భోగులు

సహియింతు రెన్నియో కష్టనష్టాలు

సాధు సజ్జన తతుల పోషకులు

ఈ ధరా సంపద నిల్పు రాజసులు

వారిని గౌరవించవమ్మా!విజయా!//


యోగులైనా భోగులైనా ధరలోన

ప్రజాశ్రేయస్సు కాంక్షించు వారలైన

మూల స్థంభాలై కర్తవ్య నిష్ఠులైన

జాతి సౌభాగ్యముకై పాటుబడిన

వారికి ప్రణతు లర్పించు విజయా!//


Rate this content
Log in

Similar telugu poem from Classics