వర్షమా
వర్షమా
కురిసిపో వర్షమా..........
నా చేతి ముత్యమా..........
ఇది నీ మహత్యమా............
చిలిపి సాంగత్యమా...........
మనసు పొరలే తెరచి చూస్తావ్ !!
పొరలి పొరలి నవ్వుతుంటావ్ !!
పొంగి పొర్లే వయసుకు అడ్డుకట్ట వేయడం తరమా ?
ఇది మాయా...... తెలియని హాయా ?
తలపుల తలుపులే మూయడం సాధ్యమా ?
తుది లేని పరిచయం..........
మదిలోన పరవశం...........
పరిమళించేనా ప్రణయమను భావనా !!
పంచి ఇచ్చేనా ప్రభావపు సూచనా !!
కురిసిపో వర్షమా...........
తడిసిపో హృదయమా..........
మది వనమునకు విచ్చేసే వసంతమా !!!
.. సిరి ✍️❤️

