STORYMIRROR

Midhun babu

Romance Classics Fantasy

2  

Midhun babu

Romance Classics Fantasy

వర్ణచిత్రం

వర్ణచిత్రం

1 min
6


ఒక గొంతుకు ఒక గొంతు పొంతన లేక 

ఒక నాలిక వేల చీలికలుగా కొల్లబడిన లోకంలో 

హృదయం పట్టుకుని ఎందుకు తిరుగుతావు 

వేళ దాటిపోయింది 

పాండవులు కౌరవులు గెలవని యుద్ధభూమిలో 

నువ్వు నేను చెక్కుకున్న వంచనా శిల్పం 

ఆకాశం వరకు ఎగబాకింది 

జీవితంకాలిన బూడిదని అందరినెత్తులకీ మెత్తుకోండి 

విభూది స్వాముల సాంప్రదాయం పాటించడం 

మన జీవన విధానంలో భాగం కూడా కదా 

ఆకొకటి చిగురేసినప్పుడల్లా మేక ఒకటి మేసేస్తుంది 

ఒక మెట్టెక్కినప్పుడల్లా ఏదో చెయ్యి నీ కాలు దిగ లాగేస్తుంది లోకాన్ని గీయాలి అనుకుంటే ఓ తెల్ల కాయితం మీద

 మసిబొగ్గునటూ యిటూ తిప్పు 

అంతకంటే తగిన వర్ణచిత్రం ప్రస్తుతానికేదీలేదు


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance