వివాహం
వివాహం


శుభలగ్నాన ఒక్కటవుతున్న రెండు పరిచయం లేని వేరు వేరు ప్రపంచాలకి శుభాభినందనలు తెలియజేస్తూ..
అగ్ని సాక్షిగా అన్నవృద్ధి నుండి సంతాన సమృద్ధి వరకు వేసే ఏడు అడుగులకు పరమార్ధం తెలుసుకుంటూ..
సమస్యలు సంధించే సన్నివేశాలు, సందర్భాలు ఎదురవకుండా ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ..
విభేదాలను తెచ్చిపెట్టే కల్పనలకు కంటతడి పెట్టకుండా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ..
దేహాల కలయికతో మీ ధ్యేయానికి కాకుండా ఒక స్వేచ్ఛా ప్రపంచానికి ప్రాణం పోస్తూ..
బాధ్యతలు భారంగా కాకుండా బలంగా మోస్తూ..
వృద్ధాప్యంలో..కడుపున పుట్టిన ప్రాణం మీ కడుపులు తన్నినా ఒకరికి ఒకరు జతగా,తోడుగా కారణం లేని ప్రేమని పంచుకుంటూ జీవనం సాగించాలని ఆశిస్తూ..