STORYMIRROR

Urs Sudheer AB

Inspirational

3  

Urs Sudheer AB

Inspirational

నాన్న

నాన్న

1 min
855

నాన్న..కళ్ల ముందు తిరిగే దేవుడి రూపం..


పాలు తాగే వయసు లో తన యద మా పడక, ఉయ్యాలలో ఎరుగని నిద్రని అక్కడ పొందే వాళ్ళం..


సరిగా కూర్చోవడం రాని వయసులో తన భుజాల మీద కూర్చున్నప్పుడు తన భుజం మాకు పల్లకి..


నడకలు నేర్చుకునే వయసులో తడబాటు లేని అడుగులు వేయించింది తన పాదాలు..


నడకలు నేర్చుకున్నాక తన చూపుడు వేలు మా దిశా నిర్ధేశం..


ఎదుగుతున్న వయసు లో మేము తప్పు చేస్తే మందలించినప్పుడు తన మనసు ఎంత నొప్పుకుందో ఇప్పుడిప్పుడే అర్థం అవుతోంది..


ఎందుకు మీ నాన్నకి అంతగా భయపడతావ్ ఇది అందరూ అడిగే ప్రశ్న, అది భయం కాదు తన మీద మాకున్న గౌరవం..అది ఎప్పటికీ తరగదు..

 


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Inspirational