కారణం
కారణం


సముద్రం లో కురిసే చినుకుకి తెలీదు అలల పయనం లో తను ఏ తీరాన్ని తడుముతుందో..
కంటి లో కారే కన్నీటికి తెలీదు ఏ కారణం వల్ల తను కనుపాపని దాటుతోందో..
కోరికలు వేసే దారి లో పయనించే మనసుకి తెలీదు చివరగా ఏ అనుభూతి ఎదురవుతుందో..
ప్రేమకై తపించే మనిషికి తెలీదు చివరగా ఎలాంటి అనుభవం మిగులుతుందో..