విత్తునైవెలగాలని
విత్తునైవెలగాలని
చలికి వణుకుతూ చావలేక బ్రతికున్న
చెట్టు మండుతూ ఎండిపోయి పొడిబారిపోతున్న
నేల అంతిమసంస్కారానికి వేచి ఉన్న పసుపు
గడ్డి వేడి శరీరంతో మట్టిపగుళ్ళ మధ్యన విత్తనం..
ఎందుకో ఇవన్నీ చూసినా నాలో నిరాశ లేదు పైగా
విత్తనం నా ఆశకు కేంద్రంగా అనిపిస్తుంది అనంతమైన
అవకాశాలు నాలో దాగి ఉండగా..
మహావృక్షంగా ఎదిగి ఎందరికో నీడని ఇస్తానని మేఘాలతో
రమించి వర్షమై కురిసి ప్రవహిస్తానని పూలు ఎన్నింటినో
పూయించి పండ్లుగా విరగ్గాసి మరిన్ని విత్తులకు అంకురార్పణ
అవ్వాలని ఆశ!
