STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

విరహ వీణ

విరహ వీణ

1 min
213

చెలిసిగలో మల్లియలకు..సిగ్గులతో పనిబడినది..! 

తోడుకోరు తాపాలకు..చినుకులతో పనిబడినది..! 


ప్రవహించే మౌనంతో..దోబూచులు ప్రణయానికి..

కలలుకనే పానుపుకే..వలపులతో పనిబడినది..! 


విరహవీణ తంత్రులింట..వియోగాగ్ని గీతికలే.. 

చెలితియ్యని రాగాలకు..నిప్పులతో పనిబడినది..!


ఏకోకిల కాకోకిల..ఏకాకియె ఎపుడైనా.. 

చెలరేగే మోహాలకు..మధువులతో పనిబడినది..! 


ఉగాదులను ప్రసవించే..వసంతాల సాక్షి చెలియ.. 

కొమ్మలింటి అందాలకు..నవ్వులతో పనిబడినది..!


అంతులేని అలజడులను..మోస్తున్నది మనసేగా.. 

మదినేలే సంద్రాలకు..పొంగులతో పనిబడినది..!


Rate this content
Log in

Similar telugu poem from Romance