STORYMIRROR

Midhun babu

Romance

3  

Midhun babu

Romance

వీలుపడనా

వీలుపడనా

1 min
1

ప్రభువులెవరో దాసులెవరో..తేల్చిచెప్పగ వీలుపడునా..! 

రాజ్యమేలే అహంకారం..రాల్చివేయగ వీలుపడునా..! 


అణగదొక్కే బుద్ధి తొలగక..సమానతయే విరియునెట్లా..

సామ్యవాదం అర్థమేదో..బోధసేయగ వీలుపడునా..! 


మంత్రతంత్రము లున్నవెక్కడ..చిత్తశాంతిని ప్రసాదించగ.. 

మనిషితనమే వెలిగెనంటే..పుడమినవ్వగ వీలుపడునా..! 


దురాక్రమణే ధ్యేయమైతే..మంచిమాటలు ఎక్కునెట్లా.. 

ఆయుధాలను నమ్ముకుంటే..బూదిపండగ వీలుపడునా..! 


సొంతగొప్పల ఊయలెవ్వరు..విరిచివేతురు చేతులారా.. 

చక్రబంధము వెర్రిమోహము..పట్టికాల్చగ వీలుపడునా..! 


మనసుమాయే తెలిసితెలిసీ..వీడకుండుటె రాగమంటే.. 

మౌననదిలో మునగకుండా..కడిగివేయగ వీలుపడునా..


Rate this content
Log in

Similar telugu poem from Romance