వీడిన సంకెళ్లు
వీడిన సంకెళ్లు


నకారాత్మకత నిండిన మాటలు
నిరాశను నింపే ఆలోచనలు
వారేమంటారో
వీరు ఏమనుకుంటారో
అందరి కోసం నీ అభిరుచుల త్యాగం
వద్దన్నా పొందిన ద్వేషం
మంచి అనిపించుకోవాలనే తాపత్రయం
అవ్వకూడదు నీకు మూర్ఖత్వం
ద్వేషపు సంకెళ్లు విడిపించుకుని
నిన్ను నువ్వు ప్రేమించుకో
ఆ వీడిన సంకెళ్లు
నీ స్వేచ్ఛకు ఆనవాళ్లు