STORYMIRROR

Midhun babu

Classics Fantasy Thriller

4  

Midhun babu

Classics Fantasy Thriller

వదిలిపో ఈ దేహాన్ని

వదిలిపో ఈ దేహాన్ని

1 min
8


మొద్దుబారిన ఆలోచనలతో 

కూర్చున్న చోటే కదలక,మెదలక 

కాలు కదపక 

భోజనం చేసి

నిదురిస్తున్నావా...!

సోమరిలా మారి 

జగాన్ని మరచి 

ఊహల్లో మేడలు కట్టి 

జీవిత గమ్యాన్ని మరచిపోతున్నావా?


రాబందులు ఎదురు చూస్తున్నాయి...

తోడేళ్లు వెంబడిస్తున్నాయి...

కుళ్ళిన ఆలోచనల దేహాన్ని... 

కష్టపడని తత్వాన్ని...

వదిలి...పో...


కుటుంబానికి,దేశానికి 

వెన్నెముకగా నిలువని రోజున 

ఆ దేహము ఎందుకు?

ఆరగిస్తున్న మృష్టాన్న భోజనం,

చెమట చిందించని ఆ దేహము ఎందుకు...

వదిలి...పో...


పిడికిలి బిగించలేని 

అన్యాయాన్ని ప్రశ్నించలేని 

కష్టానికి ఓర్చుకోలేని

త్యాగాలెందుకు? 

మనసును జయించలేని 

మనుగడ ఎందుకు?


ఎందరో పుట్టారు 

ఎంతోమంది పోయారు 

ఎంతోమంది పుడతారు 

కొంత మందే మహనీయులు 


నువ్వు మారని నాడు 

దేహం మారదు 

అలవాటు పడిన వ్యాపకం మారదు 

కానీ అది మనిషిగా మరణించిన రోజు 


సోమరితనాన్ని వదలిపెట్టు 

సుఖాల్ పక్కకు నెట్టు 

కర్తవ్యాన్ని ఆచరించు 

ధర్మాన్ని పాటించు 

శిఖరాలను అధిరోహించు...

కీర్తి ప్రతిష్టలతో దేహాన్ని వదలి...పో...



Rate this content
Log in

Similar telugu poem from Classics