వాలిన కన్నులు
వాలిన కన్నులు
ఈ వాలని కనులమాటు..పాటలెన్నొ దాగున్నవి..!
నా తలపుల గగనంలో..రంగులెన్నొ దాగున్నవి..!
ఈ పచ్చని నేలతల్లి..గుండెలయల కావ్యము'నే'..
తన వెచ్చని చిగురులలో..వగరులెన్నొ దాగున్నవి..!
గట్టుమీది చెట్టునీడ..ఎన్ని కథలు చెబుతుందో..
తన వలపుల కోవెలలో..ఊసులెన్నొ దాగున్నవి..!
పరిమళించు సంపెంగల..వనమంటే తన చూపే..
అసలుచెలిమి తోటలోన..అలుకలెన్నొ దాగున్నవి..!
చూపేందుకు దొరికేనా.. చెలివెన్నల వసంతమే..
తన బంగరు పదములలో.. ముద్రలేన్నో దాగున్నవి..!

