ఉషోదయం
ఉషోదయం
గమనం అవుతున్న కాలంతో పాటు
అక్షరం కవనంలో మారుతుంది.
ఉదయించే సూర్యుడిలా
ఉత్పన్నం మొదలవుతుంది
కవన (కవిత) రథం
సూర్య కిరణము
పుష్పాన్ని తాకినప్పుడు
గుబాలించే పరిమళంతో
వికసించే మాధుర మధురమైన కవనం
గలగల పారే సెలఏరులా
అక్షరాలే జాలువా రే
మామ మి చిగురు వాసనతో
కొత్త గొంతు సపరించినట్టు
కోకిల పాడినా
సరాగాల సమ్మోహనం కవనం
పొదల చాటున
నాగిని బుసలు
భయబ్రాంతులతో
జీవన ప్రయాణంలో వెతుకులాటలో
ఆలోచన కవనం
నీ పుట్టకతోనుండి గిట్టువరకు
సాగిపోయే జీవాక్షరమాలే
కవనరధ సారం
నిత్యం సజీవమై
సంజీవి ఏ కవనం