STORYMIRROR

VENKATALAKSHMI N

Tragedy Others

3  

VENKATALAKSHMI N

Tragedy Others

ఉరితాడు

ఉరితాడు

1 min
178


నేల దిగని వాన

చేతికి చిక్కని పంట

కడుపుకందని కూడు

ఊహకందని బాధ

ఉప్పెనయ్యెను వేదన

మిన్నంటిన రోదన

ఫలితం పసుపుతాడే ఉరితాడాయె

పురుగుల మందే పానకమాయె

నకిలీ విత్తనాలే ఆప్తులాయె

అప్పులే ఆస్తులాయె

ఎండిన పొలమే పానుపాయె

మండిన గుండె ఒంటరాయె

రైతే రాజన్నది అక్షరాలకే పరిమితమాయె

వేదనతో ఆవేదన చెందడమే 

మరో రైతుగా నిస్సహాయుడాయె


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Tragedy