ఉంటాను
ఉంటాను
నీ వెలుగె కాఫీగ..త్రాగుతూ ఉంటాను..!
వేదాంత తీర్థమది..పంచుతూ ఉంటాను..!
ఆనంద భైరవీ..వెన్నెలవు నీవందు..
నీ మోహ గీతాన..నిండుతూ ఉంటాను..!
కలగనే తీరికను..ఇస్తివే బహుమతిగ..
నీ కలల వీధుల్లొ..ఆడుతూ ఉంటాను..!
ప్రాణాలు పోవచ్చు..ఎప్పుడో ఎలాగో..
చింతనకు సెలవిచ్చి..నవ్వుతూ ఉంటాను..!
గంధాల తరుశాఖ..చెలిమియే రాగమో..
నీ ప్రేమ సింధువై..పొంగుతూ ఉంటాను..!
మాటలను పేర్చగా..మనసుపడి పోలేను..
నిజమౌన లేఖినిగ..మిగులుతూ ఉంటాను..!

