ఘక్రియా
ఘక్రియా
ఈ మనస్సు పట్టికాల్చు..గాయానికి షుక్రియా..!
చితిని పేర్చి నవ్వుతున్న..మోహానికి షుక్రియా..!
చెలి మనస్సు మించి ఊబి..ఉందెక్కడ పుడమిలో..
కోకిలతో పోటీపడు..రాగానికి షుక్రియా..!
పాఠమేదొ నేర్పాలను..తన వేడుక తీరనీ..
బాధలోను తోడుండే..విరహానికి షుక్రియా..!
కొత్తదనపు రుచిచూపే..ప్రతిక్షణం మధురమే..
మధువల్లే ఊరించే..కాలానికి షుక్రియా..!
నాలోనే నాతోనే..తానుండునె ఎప్పుడూ..
కనిపించక బలమిచ్చే..సహనానికి షుక్రియా..!
గంధాలకు అతీతముగ..హృదిలోనే వెలుగునే..
దివ్యప్రేమ రహస్యాల..దీపానికి షుక్రియా..!
