STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

ఉండనీ

ఉండనీ

1 min
3



గుండె గదినే చేరగా..మోహముంటే ఉండనీ..!
మనసు మాయే వదలగా..మోహముంటే ఉండనీ..!

వెంటపడితే పడెదపో..తప్పు పడితే పట్టుపో..
దేహమోహం రాలగా..మోహముంటే ఉండనీ..!

అసలు ఇల్లే ఎక్కడో..ఇక్కడంతా ఆటపో..
కాలమేదో చెల్లగా..మోహముంటే ఉండనీ..!

బంధమేదో సాక్షినై..చూచుతీరే ముచ్చటోయ్..
ప్రేమవృక్షం పెంచగా..మోహముంటే ఉండనీ..!

రాత్రికెంతటి ఇష్టమో..నిదుర పక్కకు జరపటం..
మౌనమధువే గ్రోలగా..మోహముంటే ఉండనీ..!

కట్టకడకీ కట్టెపై..మోజుతీరే దారిలో..
ఆశ పరుగే అండగా..మోహముంటే ఉండనీ..!


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics