తప్ప
తప్ప
లేదు కాలానికి..నీ మనసుకు తప్ప..!
కొలతలేదు విజయానికి..నీ చూపుకు తప్ప..!
మాటలతో ఊరడింపు..ఎంతసేపు ఇంపు..
పాటలేదు మరణానికి..నీ వలపుకు తప్ప..!
పలకరించు వసంతమే..శిశిరానికి ఇల్లు..
కలతలేదు పుష్పానికి..నీ సొగసుకు తప్ప..!
సమాధిలో ఉంటే ఇక..మధువెందుకు అసలు..
ఆటలేదు మధుపానికి..నీ తలపుకు తప్ప..!
నీ 'నా'దను భావనయే..కలల రాజహంస..
ప్రేమలేదు మోహానికి..నీ ఊసుకు తప్ప..!

