STORYMIRROR

Midhun babu

Romance Classics Fantasy

2  

Midhun babu

Romance Classics Fantasy

తోడు

తోడు

1 min
42


ఒకప్పుడు

నిండు ముత్తెదువుగా ఉండే పల్లె

పట్నం దారి తెలిసాక 

 రంగు వెలసిన గోడలా మారిపోయింది.


నిత్యం అనుబంధపు 

 పరిమళాలు వెదజల్లే లోగిళ్ళు 

మనుషులు కరువై

బిక్కమొహం వేసి

ఒంటరై 

వెక్కి వెక్కి ఏడుస్తున్నాయి.


మనిషి మాయకు

చెట్టు కనుమరుగయ్యి

పిట్టకు ప్రాణ భయం వెంటాడుతుందని గమనించి 

మనుషులకు సాక్ష్యంగా మిగిలిన 

వెలుగు పంచే జ్ఞాపకాన్ని

ఒంటరైన లోగిలి

పిట్టకు గూడుగా మలచి 

కబుర్లలో మునిగిపోయింది.



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance