తొలి నాగరికత
తొలి నాగరికత


పద్యం:
లోకము నలుపందు వున్ననాడు, జగము
నందు నాగరికతలేనినాడు
వేదములను మాకు భిక్షవేసితివీవు
బుద్ధిధాత దివ్య పుస్తకాంబ
భావం:
బుద్ధిని ధరించిన దివ్యమైన రూపం గల తల్లీ పుస్తక మాతా(సరస్వతీ)! ప్రపంచం అంధకారం లో మునిగి ఉన్నప్పుడు, ప్రపంచం పై నాగరికత మొదలు కాక మానవులు కొట్టుమిట్టాడుతున్న నాడు.... వేదాలను వెలికి తెచ్చి అందులోని జ్ఞానాన్ని మాకు బిక్షగా వేశావు... నాగరికతను పరిచయం చేశావు అని అర్థం.