తన ఊహను
తన ఊహను
తన ఊహను మించి అసలు..అమృతమేది లేదు..!
అంతకన్న నా శ్వాసకు..దీపమేది లేదు..!
గాలిలోన తేలిపోవు..సంగతెంత హాయి..
స్వర్గానికి ముక్కు గాక..ద్వారమేది లేదు..!
తృప్తి అనే భావనమే..అందవలసి ఉంది..
చెలి తలపున శాంతిలేక..సౌఖ్యమేది లేదు..!
ప్రకృతిని రక్షించు వారెల్ల..దైవాలే చూడు..
ప్రతికణం దివ్యవిశ్వమె..లోపమేది లేదు..!
ప్రేమగాని చెలిమిగాని..పెంచదగు సంపద..
వింతమనసు అందగల్గు..జ్ఞానమేది లేదు..!

