STORYMIRROR

Gayatri Tokachichu

Classics

4  

Gayatri Tokachichu

Classics

తెలుగు పచ్చడులు

తెలుగు పచ్చడులు

1 min
305

భాష లందున మనమాతృ భాష ఘనము
 ఫలము లందున మామిడి ఫలము లెస్స
 మంచి మాగాయ పచ్చడిన్ మహిళ లెల్ల
పెట్టుచుందురు వేసవి వేళలందు.

 ఆవకాయ, మాగాయల నాదరించు
తెలుగు వారి కీర్తి చెలగి దిశల వెలిగె
 కమ్మ నైనట్టి రుచులతో కలిమినొంది
నాంధ్రదేశము వర్థిల్లె నవని యందు.

 ముక్క కొట్టించి మురియుచు ముదిత లెల్ల
 పచ్చడులన్ జేసి తృప్తిగా బంచుకొనుచు
 ప్రాత పద్ధతులన్ విడువక జాతియందు
నిలుపు కొనుచుండ్రి ఖ్యాతిని నేటివరకు

. పసిడి నగలన్ జీరలన్ బచ్చడులను
 పొలుపు మీరగ ప్రేమించి పొంగిపోయి
 గడుపు చుందురీ తెలుగింటి కాంతలెపుడు
 వారి శ్రద్ధకు లోకంబు భళిభళియను.

 సంప్రదాయపు రుచులను సమధికముగ
 వండి వడ్డించి కాంతలు వైభవముగ
తరతరంబులు నిల్పుచు చరితకెక్క
 వారి శ్రమ కీయవలయును వందనములు.//


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics