STORYMIRROR

Midhun babu

Classics

4  

Midhun babu

Classics

తెలియాలోయే

తెలియాలోయే

1 min
6

మీద కాలేసుకు..బ్రతుకుటయే తెలియాలోయ్..!

సింహాసన మమకారం..రాలుటయే తెలియాలోయ్..!


అహంకార ధోరణియే..పతనానికి హేతువులే..

నిప్పుపూల తోటలోన..నవ్వుటయే తెలియాలోయ్..!


నిదురించే గంధాలకు..శిల్పంలా తనువున్నది..

హంసధ్వని రాగానికి..ఆడుటయే తెలియాలోయ్..!


శ్వాససాక్షి మనుగడయే..మనోహరం గమనిస్తే.. 

శివరాత్రిగ ప్రతిరాతిరి..గడుపుటయే తెలియాలోయ్..!


ఎవరికెవరు తోడంటే..మనస్సాక్షి సత్యములే..

ప్రకృతితోటి చెలిమిమీర..ఉండుటయే తెలియాలోయ్..! 


చీకుచింత మాయమైన..మనసు స్వర్గధామం కద..

అందమైన పసితనమును..కాచుటయే తెలియాలోయ్..! 



Rate this content
Log in

Similar telugu poem from Classics