తానిప్పుడు
తానిప్పుడు
కొబ్బరాకు గాలిసోకి..నదిగ మారె తానిప్పుడు!
గుండెలయల మాటు చేరి..కృతిగ మారె తానిప్పుడు..!
మౌనానికి అద్దమొకటి..నిలిపెను తన చిరునవ్వే..
మురిపించే కలహంసల..చెలిగ మారె తానిప్పుడు..!
ప్రతిచినుకున దాగెనెన్ని..ఒయారములు ఎవరికెఱుక..
అరకన్నుల గగనాలకు..సఖిగ మారె తానిప్పుడు..!
తోడుకొఱకు తపియించే..విరహాలకు వేదికేది..
తాపాలను హరియించే..సిరిగ మారె తానిప్పుడు..!
కలతలకే తావులేని..ఇల్లంటే తన తలపై..
చెలిమివనపు సోయగాల..ఝరిగ మారె తానిప్పుడు.

