సూర్యుడైతే
సూర్యుడైతే
గరికనైన తక్కువగా..తలచడులే సూర్యుడైతె..!
ఫలములిచ్చి తిరిగేమీ..అడుగడులే సూర్యుడైతె..!
తనచుట్టూ తిరుగుతున్న..పుడమినెలా ముద్దాడునొ..
కరుణకిరణ కోటి కురియు..తాకడులే సూర్యుడైతె..!
వరదలతో ముంచెత్తే..అపురూపత తనని కద..
గుణాతీత సమాధి తా..వీడడులే సూర్యుడైతె..!
ప్రాణదాత అన్నదాత..నిత్యమైత్రి వరదాతే..
ధీశక్తిని పంచుటసలు..మానడులే సూర్యుడైతె..!
భూమికి మరి దగ్గరగా..ఒకజాబిలి పువ్వు తోడు..
వెన్నెలింటి పంటనివ్వ..మరువడులే సూర్యుడైతె..!
