STORYMIRROR

Gayatri Tokachichu

Classics

4  

Gayatri Tokachichu

Classics

సుమబాలలు

సుమబాలలు

1 min
339


తొలిపొద్దు పొడిచే వేళ

కలువలు ముడుచుకు పోయే వేళ

ఆ పూల వనంలో అందాల సుమబాలలు

స్వాగతించగా సంబరపడుతూ

అడుగిడితినే నబ్బుర పడుతూ


తెలిమంచు బిందువులు బుగ్గలపై జాఱగా

మందార మొకచోట మనసునే దోచింది.


విరిసిన మల్లెల పరిమళ మొకచోట

మత్తును కలిగించ మైమఱచి పోతి.


కనకాంబరాల సౌరు కట్టి పడవేయగా

చామంతి పూవులు చల్లగా పిలిచె.


పారిజాతంబులు పఱచగా తివాచి

గన్నేరు పూవులు గలగలా నవ్వె.


ఏమి సోయగాలు!ఏమి పొంకాలు!

అందాల పూదోట హేమంత రాగాలు.


తొలివెలుగు దీపాల ధరణికే సిరులు

సుమ బాలల సొబగు చూచినంత చాలు

మదిలోన ప్రభవించు కోటి కావ్యాలు.

-----------------------------


Rate this content
Log in

Similar telugu poem from Classics