సరాగాలు
సరాగాలు
సరాగాలు నన్ను చేర
మనసు... పల్లకిలో ఊరేగ
సుస్వరాలు పాటలై పలుక...
విహరించనా వినీల ఆకాశంలో...
సుగంధ పరిమళాలు పలుకరించ
తియ్యని భావాలు మది అందుకోగ
తెలియని ఉత్సాహమేదో పుట్టుకొచ్చి.... చిరునవ్వును చేర...
విహరించనా వినీల ఆకాశంలో...విహంగమై...
సంతోషాన్ని ఇచ్చిన సమయాన్ని... జ్ఞాపకంగా గుర్తుపెట్టుకోన...
లేక...
ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ...
జీవితంలో సరాగాలు పండించనా...
ఏదేమైనా...
సరాగాలను వదలగలనా... జీవితంలో...
ఆస్వాదించే క్షణాలను మరువగలనా..

