సొగసులు...
సొగసులు...
ఆడపిల్ల సొగసులు ఇంద్రధనస్సులు....
సరికొత్త సప్తవర్ణాల హరివిల్లు గా
వేకువలో కురుస్తున్న మంచుబిందువులె ....
నా ఆభరణాలు
తొలి నులివెచ్చని కిరణాలు ........
అలవోకగా తాకుతుంటే నా
మనసంతా తెలియని .......
అనుభూతుల మాధుర్యం
మది నిండా మౌన రాగాలు.....
కన్నుల నిండా స్వప్నాలు
పరిమళించే నీ తలపలు అనుక్షణం ....
వినిపించే మోహన రాగాలే...
... "సిరి"✍️

