సొగసు
సొగసు
(బాలపంచపదులు )
వేదకాలము నాటిదీ విభవము
మోదమిచ్చెడి ఘన సంప్రదాయము
సంస్కృతిని నిలబెట్టు సాధనము
స్త్రీ సౌందర్యపు శోభనా విలాసము
అదే మనదౌ చీరకట్టు విజయా!
విశ్వాన్ని గెల్చిన వస్త్రదారణము
శాశ్వతమై యుగములపర్యంతము
నిల్చియున్నట్టిదీ భారతీయత్వము
ప్రత్యేకతను జూపు హుందాతనము
అదే మనదౌ చీరకట్టు విజయా!
స్త్రీ గౌరవాన్ని పెంచెడి సంస్కారము
అమ్మతనానికిది ఆలంబనము
జాణతనాన్నొలికించే శృంగారము
సొగసైన హొయలుతో సంపన్నము
అదే మనదౌ చీరకట్టు విజయా!
వెఱ్ఱి పోకడ లెన్నెన్ని ముదిరిన
పాశ్చాత్య ధోరణి వరదై పొంగిన
పరువు పోగొట్టు కాలంబు వచ్చిన
విలువతో విలసిల్లి పూజ్యమైన
కలిమికి కాణాచి చీర విజయా!//
