సంథ్య కాంతులు
సంథ్య కాంతులు
వెన్నల ఒడిలో
విరిసిన పువ్వై నే రానా...
అరవిరిసిన కలువ భామనై
నీ దరికి చేరనా...
చల్లని మందస్మిత గాలినై
నిన్ను చుట్టుకోనా....
నింగి తారకలను పూలగ చేసి
నీపై కురిపించనా....
మనసు మమతలను
మాలగా చేసి నీకర్పించనా...
సంధ్య కాంతులతో నీరాజనం అర్పించగా...

