సంసారవృక్షం
సంసారవృక్షం
*సంసారవృక్షం*
(కవిత)
వధూవరులయాకాంక్షలు వెల్లువై
ఆర్యులాశీశ్శులక్షతలే జల్లులై
మంగళ వాయిద్యాలే రాగపల్లవై
జీవనయానంలో నూరు శరత్తులై
సాగునీ చక్రమనురాగబంధమై.
ప్రేమమయమైన సంసార సాగరం
కారాదు! కారాదపార్థాల కల్లోలం!
సనాతనమైనదీ భారత ధర్మం
సంప్రదాయాలకాలవాలమౌ గృహం
చిన్నాభిన్నమైతే కల్గు తీరని శోకం
పాశ్చాత్య ధోరణికడ్డుకట్ట వేద్దాం!
సహనంతోనే సమస్యా పరిష్కారం
సర్దుబాటు తనంతోనే శ్రేయస్కరం
పరమోన్నతమైన గృహస్థాశ్రమం
తరతరాలుగా సాగే పారంపర్యం
భావితరానికదే వెలుగుల మార్గం
దిగజారెడి విలువలతో నాశనం
ప్రగతికవరోధమైనట్టి దరిద్రం
చుట్టుముట్టగా భారతీయ సమాజం
తల్లడిల్లగా ప్రత్యక్షమౌ నరకం
కలిసియుండుటే తక్షణ కర్తవ్యం
పెంచుకొందాము దాంపత్య వృక్షవనం
ఫలవంతమైన భాగ్యం మన సొంతం.//
